-జిల్లా ప్రథాన న్యాయమూర్తి గంధం సునీత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
శనివారం తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ శ్రీమతి. గంధం సునీత మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.ప్రకాష్ బాబు గజిల్లా కోర్ట్ ఆవరణలో “రోడ్డు ప్రమాదాల నివారణ” మరియు “హెల్మెట్ ధరించాల్సిన ఆవశ్యకత” పై కోర్ట్ సిబ్బంది కి విజ్ఞాన మరియు అవగాహనా సదస్సు నిర్వహించారు. రాజమహేంద్రవరం లో వివిద బ్యాంకుల సహకారం తో హెల్మెట్ లేకుండా ద్వి చక్ర వాహనం నడిపే ఔట్ సోర్సింగ్ సిబ్బంది కి హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారు మాట్లాడుతూ ద్విచక్ర వాహనం నడిపే ప్రతీ ఒక్కరు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడపడం ప్రమాదకరం మరియు చట్టరిత్య నేరం అని తెలిపారు.అతి వేగం ప్రమాదకరమని, ప్రతీ ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, నిబంధనలు ఉల్లంఘించి ఎవరు వాహనాలు నడపరాదని అన్నారు. హెల్మెట్ ధరించడం శిరస్సు పై బరువుగా భావించుకుండా అది మీ బాధ్యతగా భావించాలి అని తెలిపారు.