రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె.ప్రకాష్ బాబు పట్టణంలోని కె.వి. స్టేట్ హోం మరియు బాలుర పర్యవేక్షణ గృహమును సందర్శించారు. ముందుగా ప్రకాష్ నాగర్ లోని కె.వి. స్టేట్ హోం ను సందర్శించి అక్కడ వసతులని పరిశీలించారు. ఆ తరువాత బాల సదనమును సందర్శించి చిన్నారులతో మాట్లాడరు. వారికి అక్కడ ఏ విధమైన అసౌకర్యం ఉన్న తెలియజేయాలన్నారు. అనంతరం ఉద్యోగినుల వసతి గృహమును సందర్శించి వసతులను పరిశీలించారు. ఆ వసతి గృహ సిబ్బందికి పలు సూచనలు చేశారు. అక్కడ అందచేస్తున్న ఆహార పదార్థాలను రుచి చూశారు. అనంతరం బాలుర పర్యవేక్షణ గృహమును సందర్శించిన న్యాయమూర్తి అక్కడి వసతులను పరిశీలించి బాలురుతో కాసేపు మాట్లాడరు. శ్రద్ధగా చదువుకుని ఉన్నత స్థాయికి రావాలన్నారు. న్యాయ మార్గాన్ని అనుసరిస్తే జీవితంలో ప్రశాంతత, గౌరవం లభిస్తాయని లేదంటే జీవితం దుర్బలం అవుతుందని వివరించారు. వారికి ఎలాంటి న్యాయ సేవలు కావాలన్న జిల్లా న్యాయ సేవాధికర సంస్థకి తెలియజేయాలన్నారు.
Tags rajamandri
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …