Breaking News

సామాజిక న్యాయమే లక్ష్యంగా నామినేటెడ్ పదవుల భర్తీ …

-రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో మొత్తం 135 నామినేటెడ్ పదవులు భర్తీ, వాటిలో 76 పదవులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీవర్గాలకు ఇచ్చాం
-ఈ ప్రభుత్వం. పదవుల భర్తీలో మహిళాలకు 50.4 శాతంతో మహిళలకు పెద్దపీట
-అటు సంక్షేమం.. ఇటు సామాజిక న్యాయంలో ఏపీ ప్రభుత్వం దేశానికే ఆధార్శంగా నిలిచింది
-పదవులు అలంకారప్రాయం కాదు- ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే సంస్కరణల్లో భాగం కావాలి
-డా. అంబేడ్కర్ ఆశయ సాధన- సీఎం జగన్ మోహన్ రెడ్డి వల్లే సాధ్యo
-హోం మంత్రి సుచరిత
-ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి
-బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ
-రాజ్యసభ సభ్యుడు  మోపిదేవి వెంకటరమణ
-ఎంపీ నందిగం సురేష్‌
-ఎమ్మల్యే మేరుగ నాగార్జున

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సామాజిక న్యాయమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ఈరోజు ప్రకటించిన 135 రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో నామినేటెడ్ పదవుల భర్తీలోనూ ముఖ్యమంత్రి  వైయస్ జగన్ మోహన్ రెడ్డి సామాజిక న్యాయం పాటిస్తూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ పెద్ద పీట వేశారు. క్యాబినెట్ కూర్పు నుంచి నేడు ప్రకటించిన రాష్ట్ర, జిల్లా స్థాయి నామినేటెడ్, కార్పోరేషన్ పదవుల వరకూ సామాజిక న్యాయమే లక్ష్యంగా, అణగారిన వర్గాల ఆర్థిక, సామాజిక, రాజకీయ అభ్యున్నతే ధ్యేయంగా ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ అహర్నిశలు కృషి చేస్తున్నారనడానికి ఇదొక తార్కాణం. సామాజిక న్యాయం అన్నది ఇప్పటివరకూ రాజకీయ వేదికల మీద కేవలం ఉపన్యాసాలకే పరిమితం కాగా… జగన్ మోహన్ రెడ్డిగారి పాలనలో చేతలతో నిరూపించారు.

రాష్ట్ర, జిల్లా స్థాయి నామినేటెడ్ పదవులు మొత్తం 135 ప్రకటిస్తే అందులో 76 ( అంటే 56 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే పదవులు దక్కాయి. మొత్తం పదవుల్లో యాభై శాతం కంటే ఎక్కువ పదవులు 50.4శాతం అంటే 68 పదవులు మహిళలకు దక్కాయి. ఇది మహిళా పక్షపాతి ప్రభుత్వం అని మరోసారి రుజువైంది.

ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారులు(ప్రజా వ్యవహారాలు)  సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ గతంలో మాదిరిగా నామినేటెడ్‌ పదవులు అనేవి అలంకార ప్రాయం కాదని, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తలపెట్టిన మహా యజ్ఞంలో ప్రభుత్వం ఎలా అయితే బాధ్యతాయుతంగా పని చేస్తోందో అలాగే నామినేటెడ్‌ పదవులు అందిపుచ్చుకున్నవారికి కూడా అంతే బాధ్యత ఉంటుందని, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే సంస్కరణల్లో వారి పాత్ర కీలకమని అన్నారు.

– 2019 మే 30న వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2019కి ముందు ఆ తర్వాత అన్న విధంగా ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తొలిరోజు నుంచే ఆయన తన మార్కు పాలన చూపించారు. గత రెండేళ్లలో సామాజికంగా, ఆర్థికంగా, అలాగే మహిళా సాధికారిత పరంగా, సంక్షేమం, అభివృద్ధిపరంగా రాష్ట్రంలో పెనుమార్పులు చోటుచేసుకున్నాయన్నారు. ఒక సానుకూల ఫలితం నుంచి దీర్ఘకాలిక ప్రభావం చూపే విధంగా.. రాష్ట్రం మొత్తం భవిష్యత్‌ తీర్చిదిద్దేలా, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడటం. మొత్తంగా చెప్పాలంటే వెనుకబాటు తనంతో ఉన్నవారి కోసం అట్టడుగు స్థాయికి అభివృద్ధి ఫలాలు అందరికీ అందేలా జగన్ పరిపాలన చేస్తున్నారు. – అందుకు తగ్గట్టే నాడు బీసీ డిక్లరేషన్‌ చేసినప్పటి నుంచి.. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టుగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి పాటుపడుతూ వచ్చారు. రెండేళ్ళ పాలనలో అన్నింటిలో జగన్ సామాజిక న్యాయం ఎలా పాటిస్తూ వచ్చారో కనిపించింది. అది ఆఖరకు పరిపాలనా వికేంద్రీకరణ దిశగా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాల్లో కూడా దాదాపు 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారు ఎంపిక కావడం జరిగింది. బహుశా లక్షా, 30వేల ఉద్యోగాల్లో 80 శాతం పైగా ఎంపిక కావడం అనేది దేశ చరిత్రలో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ అంశం.

– మొత్తంగా ప్రభుత్వం, స్థానిక సంస్థలు, కార్పొరేషన్లు, పార్టీ నాయకత్వం అన్నీ కలిసి వచ్చే మూడేళ్లలో ఎన్నికలు వచ్చే సమయానికి ఒక పదిహేనేళ్లలో జరగాల్సిన సానుకూల మార్పులు, ప్రజల జీవితాలు మెరుగుపరచడం, రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడంమే లక్షం అలాగే 135 పదవుల్లో 68మంది మహిళలకు కేటాయించి జగన్‌ మోహన్‌ రెడ్డి పెద్దపీట వేశారు. 67మంది పురుషులు ఉన్నారు. ఈ రకంగా ప్రకటిస్తున్న పదవుల్లో 56 శాతం వెనకబడ్డ తరగతులకు. 50.4 శాతం మహిళలకు కేటాయిస్తూ ముఖ్యమంత్రిగ నిర్ణయం తీసుకున్నారు. ఇది చాలా పెద్ద చరిత్రాత్మక మార్పు. ఇంత సానుకూల నిర్ణయం అనేది మాటల్లో కాకుండా చేతల్లో చూపించారు. ఈ విషయాన్ని మా ప్రభుత్వం సగర్వంగా చెప్పుకుంటాం. జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారం చేపట్టక ముందు నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్దపీట వేస్తామని ఏదైతే చెప్పారో అదే విధంగా ఈరోజు చేతల్లో అమలు చేశారు. ఇక కుటుంబంలో మహిళను కేంద్ర బిందువుగా గుర్తించి అన్ని పథకాలను ఎలా అయితే అమలు చేస్తున్నారో ఆఖరికి మహిళలకు రాజకీయంగా సాధికారిత కల్పించే దిశగా పెద్ద ముందడుగు వేశారనటానికి ఇదో ఉదాహరణగా చెప్పవచ్చు.

హోం మంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ సామాజిక న్యాయం అమలులో దేశం యావత్తూ ఏపీవైపు చూస్తోంది. నామినేటెడ్ పదవులకు ఎంపికైన వారి వివరాలను ప్రకటించిన రాజ్యాంగ ఫలాలు అణగారిన వర్గాలకు అందజేసే విధంగా డా. బీఆర్‌ అంబేడ్కర్‌  ఆలోచనా విధానాలను ముందుకు తీసుకువెళుతూ దేశంలోనే ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పని చేస్తున్నారు. ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మంత్రివర్గ కూర్పు నుంచి మొదలు నామినేటెడ్‌ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు పెద్దపీట వేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా వెనుకబడినవర్గాలకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడమే కాకుండా దళిత మహిళగా తనకు హోంమంత్రి పదవిని ఇవ్వడం జరిగింది. గతంలో ఒకటీ,రెండు మంత్రి పదవులు మాత్రమే ఎస్సీ వర్గాలకు దక్కేవి. అలాంటిది ఇప్పుడు జగన్ కేబినెట్ లో అయిదుగురికి మంత్రి పదవులు ఇచ్చారు. అంతేకాకుండా గతంలో ఎన్నడూ లేనివిధంగా అన్నిరంగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రాధాన్యత కల్పిస్తూ.. మరీ ముఖ్యంగా గుర్తింపులేని వర్గాలకు కూడా గుర్తింపు తెచ్చి 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. మహిళలకు కూడా సమాన అవకాశాలు ఇస్తూ యాబై శాతం మేరకు అన్ని పదవుల్లో మహిళలను నియమిస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చెందుతుంది. ఈరోజు భారతదేశం మొత్తం ఆంధ్రప్రదేశ్‌ వైపు చూసే విధంగా సామాజిక న్యాయం పాటిస్తూ, మరోవైపు సంక్షేమంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుతున్నారు.

బీసీ సంక్షేమ శాఖ మంత్రి  చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ రాజకీయ అధికారం అణగారిన వర్గాల చేతుల్లో ఉండాలని మనసా వాచా కర్మణా నమ్మిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఎక్కడో కుగ్రామంలో పుట్టిన నాకు ఇచ్చిన ఈ అవకాశమే అందుకు నిదర్శనం. భారతదేశ రాజకీయ చిత్ర పటంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాన్ని ఆదర్శంగా తీసుకుని ఏ వర్గాలు అయితే ప్రభుత్వ ఫలాలు కోసం ఎదురు చూస్తున్నాయో వాటిని అందించడంలో దేశంలోనే ప్రప్రధమ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి నిలుస్తారు. నాడు రాజకీయాలు పేదవారికి అందని ద్రాక్ష. నేడు అందిన ద్రాక్ష అని చెబుతున్నాను. పేదవాడు పేదరికాన్ని జయించాలని లక్ష్యంతో చేస్తున్న యజ్ఞం, యాగంలో భాగస్వామ్యం అవుతున్నవారిందరికీ, కార్పొరేషన్‌ చైర్మన్లుగా పదవి స్వీకారం చేయబోతున్నవారికి శుభాకాంక్షలు.

మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ రాష్ట్ర, చరిత్రలోనే చరిత్రాత్మక నిర్ణయాలను తీసుకుంటూ సమాజంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి  పరిపాలన చేపట్టిన నాటి నుంచి పరిపాలనపరంగా, వ్యవస్థపరంగా, సంస్థాగతంగా అనేక మార్పులు తీసుకువచ్చారు.రాష్ట్ర జనాభాలో సగ భాగానికి పైగా ఉన్నవారి అభ్యున్నతికి గత పాలకులు ఎన్నికలకు ముందు వారి సంక్షేమానికి నిర్ణయం తీసుకుంటున్నామని వాగ్దానాలు ఇచ్చి వారిని ఓటుబ్యాంక్‌ రాజకీయాలకు పరిమితం చేయడం జరిగింది. రాజకీయ ప్రాధాన్యత ఇచ్చే విషయంలో ఎక్కడా సరైనా గౌరవం, గుర్తింపు లభించలేదు. దానికి పూర్తిగా భిన్నంగా అణగారిన వర్గాలకు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఒక గౌరవప్రదమైన జీవనశైలి కొనసాగించాలనే ఆలోచనతో జగన్‌ మోహన్‌ రెడ్డి అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.
సంక్షేమ పథకాలు అమలు నుంచి నామినేటేడ్‌ పదవులు, ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు.. భారతదేశంలో ఏ బీసీ వర్గానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి పరిపాలన కొనసాగిస్తున్నా.. ఆయా వర్గాల అభ్యున్నతికి ఎవరూ ఇంతగా పాటుపడిన దాఖలాలు లేవు. ముఖ్యమంత్రి నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఈ వర్గాల వారు అందరూ రానున్న రోజుల్లో జగన్‌ మోహన్‌ రెడ్డి  నాయకత్వంలోనే రాష్ట్రం సర్వతోముఖంగా అభివృద్ధి చెందుతుందనేలా పనిచేయాలి.

ఎమ్మల్యే మేరుగ నాగార్జున మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో సామాజిక న్యాయం, పేద ప్రజల అభివృద్ధి, వారి స్థితి గతులు మెరుగుపరచాలని ఇప్పటివరకూ పుస్తకాల్లోనే చదువుకున్నాం. ఇదే విషయాన్ని చాలామంది చెబుతూ ఉంటారు. ఇవాళ ఏపీలో పరిపాలనను చూస్తుంటే సువర్ణ అక్షరాలతో లిఖించాలి. డా. బీఆర్‌ అంబేడ్కర్‌, పూలే చెప్పినట్లుగా సామాజిక స్థితిగతులు మెరుగుపరచాలనే ఆలోచనలు ఆంధ్రప్రదేశ్‌లో విరాజిల్లుతున్నాయి. అందుకు తార్కాణమే సంక్షేమ పథకాలతో పేద ప్రజల స్థితిగతులు మార్చేలా, రాజకీయంగా వారికి చేయూత, గౌరవం ఇచ్చేలా జగన్‌ మోహన్‌ రెడ్డిగారి నేతృత్వంలో బంగారుబాటలా ముందుకు వెళుతోంది. ఎక్కడో అట్టడుగున ఉండి పార్టీ కోసం పనిచేసిన వారిని కూడా గుర్తించి వారికి పదవులు కట్టబెట్టడం జరుగుతోంది. రాష్ట్ర ప్రగతిలో పాలుపంచుకునేలా ఎస్సీ, ఎస్టీలకు అవకాశం కల్పిస్తున్నారు. భారతదేశంలో ఎక్కడా ఇలాంటి నాయకత్వం లేదు. రాబోయే రోజుల్లో కూడా అంబేద్కర్‌ ఆలోచనా విధానం ఏపీలో కొనసాగుతుంది. రాబోయే రోజుల్లో కూడా జగన్‌  నేతృత్వంలో ప్రతి ఇల్లు, ప్రతి గడప సస్యశ్యామలంగా ఉండబోతుంది. దళిత, బహుజన సంక్షేమానికి జగన్‌ మోహన్‌ రెడ్డి పెద్దపీట వేశారు.

ఎంపీ నందిగం సురేష్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గొప్పగా రాష్ట్రాన్ని పరిపాలించడమే కాకుండా పదవులు ఇచ్చే విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గకుండా, చెప్పిన మాటకు మిన్నగా.. అంతకంటే ఘనంగా ఇవాళ చైర్మన్లను ఎంపిక చేయడం జరిగింది. గతంలో ఏ ప్రభుత్వం అయినా అణగారిన వర్గాలకు ఒకటీ రెండు పదవులు మాత్రమే ఇచ్చేవారు. అయితే జగన్‌ మోహన్‌ రెడ్డిగారిని చూస్తే పేదవారికి ఇంత చేయవచ్చా అన్నట్లుగా చిట్టచివరి వాడికి కూడా ఒక అవకాశం రావాలనే భావనతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పని చేస్తున్నారు.
– తనను నమ్మినవారికి, పార్టీకోసం పనిచేసిన వారికి తగు న్యాయం చేసే విధంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. జగన్‌ మనసు ఒకటే …అందరూ సమాన స్థాయిలో ఉండాలి. కష్టపడిన ఓ వ్యక్తి ఇబ్బంది పడకూడదనే విధంగా ఈ పదవులు ఇచ్చారు. ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, మైనార్టీలు రాష్ట్ర ప్రజలు అయ్యుంటే చాలు.. వారికి న్యాయం చేస్తామని పాదయాత్రలో హామీ ఇచ్చారో అది కొనసాగిస్తూ పాలన చేస్తున్న ముఖ్యమంత్రికి ఎల్లవేళలా రుణపడి ఉంటాం. అంబేద్కర్‌ ఆశయ సాధన అంటూ ఇంతకాలం వేదికల మీద నాలుగు మంచి మాటలు చెప్పి వెళ్లేవారినే చూశాం. అంబేద్కర్‌ ఆశయ సాధన జగన్‌ మోహన్‌ రెడ్డిగారు సాధిస్తున్నారు. బలంగా అమలు చేస్తున్నారు. ఆయన ఏదైనా మంచి చేయాలనుకుంటే … చేసిన తర్వాత మాట్లాడటానికి కూడా ఇష్టపడరు. గొప్ప మనసున్న నాయకుడు జగన్‌. తనను కార్యకర్త నుంచి ఎంపీ స్థాయికి పనిచేసేలా అవకాశం కల్పించారు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *