-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలకు కావాల్సిన సౌకర్యాలను కల్పించాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదివారము ఉదయం తన పర్యటనలో భాగంగా సాంబమూర్తి రోడ్, భగత్ సింగ్ రోడ్, జి ఎస్ రాజు రోడ్, పాతపాడు, నూజివీడు రోడ్, సింగ్ నగర్ కండ్రిక ప్రాంతాలు తిరిగి క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులను ఆదేశించారు. 64వ డివిజన్లో నివసిస్తున్న ప్రజలకు సదుపాయాలన్నీ కల్పించాలని, త్రాగునీటి సరఫరాకు ఎటువంటి అంతరాయం లేకుండా శుద్ధమైన త్రాగునీటి సరఫరా చేయాలని, ప్రతిరోజూ త్రాగునీటి నమూనాలను పరీక్షిస్తున్నప్పటికీ పూర్తి నిర్ధారణ ఖచ్చితంగా చేసుకోవాలని, త్రాగునీటి పైపులైనులు డ్రైనులో కలవకుండా చూసుకోవాలని, అక్కడ ప్రజలకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాల ప్రణాళికలను పూర్తి చేసి తనకు సమర్పించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు, ఖాళీ స్థలాలలో పార్కులను అభివృద్ధి చేయాలని, పాయికాపురం చెరువును అభివృద్ధి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో చీఫ్ సిటీ ప్లానర్ జి వి జి ఎస్ వి ప్రసాద్, ఇంచార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, సూపర్డెంట్ ఇంజనీర్ వర్క్స్ పి సత్యనారాయణ, ఇన్చార్జ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.