మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఢిల్లీలో కేంద్ర హోం వ్యవహారాల మంత్రి అమిత్ షా ని సోమవారం మర్యాద పూర్వకంగా కలిసి, ఇటీవల మహారాష్ట్ర లో జరిగిన ఎన్నికలలో విజయం సాధించినందుకు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి అభినందనలు తెలియ జేశారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ మహారాష్ట్ర లో జనసేన అధ్యక్షులు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించిన అన్ని ప్రాంతాలలో తమ అభ్యర్థులు విజయం సాధించారని, పవన్ కళ్యాణ్ కు అక్కడి ప్రజలలో గల ఆదరణ వల్ల మా గెలుపు లో అయన కూడా భాగ మాయ్యారని , పవన్ కళ్యాణ్ మంచి క్రౌడ్ పుల్లర్ అని అయన తెలిపారు. ఇందుకు ఎంపీ బాలశౌరి కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలియ చేస్తూ, త్వరలో ఢిల్లీలో జరగబోయే ఎన్నికలలో కూడా విజయం సాధించాలని ఆకాంక్షించారు.
Tags machilipatnam
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …