-ఛాంపియన్‌గా నిలిచిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సుమతి నల్లబంటు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బెంగళూరులోని అమీబా బౌలింగ్ సెంటర్‌లో నవంబరు 30న జరిగిన ఏఆర్సీ 33వ జాతీయ టెన్‌పిన్ బౌలింగ్ ఛాంపియన్ షిప్‌లో కర్ణాటకకు చెందిన ఆకాశ్ అశోక్ కుమార్, ఆంధ్రప్రదేశ్‌కి చెందిన సుమతి నల్లబంటు ఛాంపియన్‌లుగా నిలిచారు. వరుసగా తన 7వ ఫైనల్‌ను ఆడుతున్న కర్ణాటకకు చెందిన ఆకాష్ రెండు గేమ్‌ల టైటిల్ పోరులో ఢిల్లీకి చెందిన షేక్ అబ్దుల్ హమీద్ (425-353)పై సునాయాసంగా విజయం సాధించి తన 3వ టైటిల్‌ను గెలుచుకున్నాడు. అలాగే మహిళల విభాగంలో ఫైనల్లో ఏపీకి చెందిన సుమతి నల్లబంటు కర్ణాటకకు చెందిన ప్రీమల్ జెపై (342-286) విజయం సాధించింది. ఇది సుమతికి 4వ జాతీయ కిరీటం. అంతకుముందు సెమీ ఫైనల్స్‌లో సుమతి (ఆంధ్రప్రదేశ్) అనురాధ సర్దా (ఢిల్లీ) (356-272)పై విజయం సాధించి ఫైనల్‌కు చేరుకోగా, క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్‌లో సుమతి కాశ్మీరా కుడలే (మహారాష్ట్ర) (424-309)పై విజయం సాధించింది. ఈ సందర్భంగా సుమతి నల్లబంటుకు ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు నుండి ప్రశంసలు అందుతున్నాయి. ఆమె మరింత రాణించి దేశానికి, రాష్ట్రానికి పేరు ప్రతిష్టలు మరింత ఇనుమడింపజేయాలని వారు కోరుతున్నారు.
ప్రత్యేక అవార్డులు సాధించినవారు వీరే..
మోస్ట్ ప్రామిసింగ్ ప్లేయర్.. ధనుష్ రెడ్డి (కర్ణాటక), 225 కంటే ఎక్కువ స్కోర్‌ల గరిష్ట సంఖ్య (పురుషులు) షేక్ అబ్దుల్ హమీద్ (ఢిల్లీ), 200 కంటే ఎక్కువ స్కోర్‌ల గరిష్ట సంఖ్య (మహిళలు) – షబీనా కస్మానీ (మహారాష్ట్ర) ఆరు గేమ్‌లలో అత్యధిక బ్లాక్ (పురుషులు) షైల్ అబ్దుల్ హమీద్ (ఢిల్లీ) (1359 పిన్స్), ఆరు గేమ్‌లలో అత్యధిక బ్లాక్ (మహిళలు) అనురాధ సర్దా (ఢిల్లీ) (1081 పిన్స్), పర్ఫెక్ట్ గేమ్ షేక్ అబ్దుల్ హమీద్ (ఢిల్లీ) ఉన్నారు.
Prajavartha Online Telugu News