– కలక్టర్ పి ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ ప్రవేటు భాగస్వామ్యంతో కడియం నర్సరీలను ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దేలా నర్సరీ ప్రతినిధులతో సంప్రదించడం, కార్యరూపం దాల్చడం పై సమన్వయ శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరు ఛాంబర్ లో పర్యటక, హార్టికల్చర్, రెవిన్యూ, పంచాయతి రాజ్ అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ, కడియం నర్సరీలను పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే విధంగా వివిధ రకాల అంశలతో కూడిన రీతిలో అభివృది చెయ్యాల్సి ఉంటుందన్నారు. బోటింగ్, స్టాల్ల్స్, జిప్ లాగ్, అడ్వంచర్ స్పోర్ట్స్ తదితర అంశాల సమ్మేళనంగా ఈ ప్రాంతం అభివృద్ది చెయ్యాల్సి ఉంటుందన్నారు. ఏదో ఒక దానితో సరిపెట్టడం వల్ల పర్యాటకులను ఆకర్షించడం సాధ్యం అయ్యే అవకాశాలు ఉండవని తెలిపారు. టూరిజం అభివృద్ధి వలన ఈ ప్రాంతానికి గుర్తింపు తో పాటు, ఇక్కడి వారికి ఉపాథి అవకాశాలు పెరుగుతాయని కలెక్టర్ ప్రశాంతి పేర్కొన్నారు. స్టాల్ల్స్ ప్రతిపాదన కోసం లే అవుట్ సిద్దం చేసి, కేటాయింపులు పై ప్రణాళిక అందచేయాలని ఆదేశించారు. సౌందర్య, వాస్తుశిల్పి, ఎక్కువ మంది సందర్శించే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొవాల్సి ఉంటుందన్నారు. కడియం ప్రాంతాన్ని శానిటేషన్ పరంగా చక్కటి నిర్వహణా వ్యవస్థ ఉండాలని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో ఏపీఏమ్ఐపి పిడి ఏ దుర్గేష్, జిల్లా పర్యటక అధికారి పి. వెంకటాచలం , పర్యటక శాఖ మేనేజర్ సీహెచ్.. పవన్ కుమార్, డిప్యూటి ఈ ఈ (పర్యటక) జి ఎస్ వివి సత్యనారాయణ, సహయ మేనేజర్ ఆర్ గంగా రాజు, జిల్లా హార్టీకల్చర్ అధికారి బి. సుజాత కుమారి, కడియం తహసిల్దార్ కే.. పోసుబాబు, ఎంపిడివో కే. రమేష్ తదితరులు పాల్గొన్నారు.