-ఆర్డీవో రాణి సుస్మిత
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ప్రతి మండల తాహసిల్దార్ కార్యాలయంలో జరుగుతుందని ప్రజలు తమ అర్జీలను అక్కడ అందచేయాలని రెవిన్యూ డివిజన్ అధికారి రాణి సుస్మిత పేర్కొన్నారు. సోమవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన “పి జి ఆర్ ఎస్ – మీ కోసం” వేదిక లో వచ్చిన అర్జీలను డివిజన్ స్థాయి అధికారులతో కలసి స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్డీఓ రాణి సుస్మిత మాట్లాడుతూ “పిజిఆర్ఎస్ – మీ కోసం” ద్వారా ప్రజల నుంచి ఈ రోజు మూడు అర్జీలను స్వీకరించడం జరిగిందన్నారు. ప్రతి అర్జీని నిర్నీత కాలవ్యవధిలో పరిష్కరించి దరఖాస్తు దారునికి తగిన న్యాయం చేయాలని క్షేత్ర స్థాయి అధికారులకు సూచించారు. మీ కోసం లో వచ్చిన ప్రతి అర్జీని పరిశీలించి అర్జీదారునికి పూర్తి స్థాయి న్యాయం చెయ్యాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ స్థాయి అధికారులు తదితరు లు పాల్గొన్నారు.