రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
అధికారులు నిర్దేశించిన లక్ష్యాలను సాధించడంలో సమర్ధవంతంగా పనితీరుని ఉండాలనీ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ డ్వామా, స్త్రీ శిశు సంక్షేమ, రెవిన్యూ భూ సంబంధ , పరిశ్రమల శాఖ ప్రగతి పై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, ఉపాధిహామీ పని దినాలు లక్ష్యం సాధించే దిశగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. తక్కువ ప్రగతి సాధించిన మండల స్థాయి అధికారులు మెరుగైన ఫలితాలు సాధించడం ముఖ్యం అన్నారు. గృహ నిర్మాణ పనులకు సంబంధించి పని దినాలు లక్ష్యం 100 శాతం సాధించాల్సి ఉందన్నారు. 84 శాతం లక్ష్య సాధనలో రాష్ట్ర స్థాయిలో ప్రధమ స్థానం లో ఉన్నామని పేర్కొన్నారు.
సాక్ష్యం 2024-25 కింద జిల్లాలో 704 అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ వాటికలు , టాయిలెట్స్ నిర్మాణం, మరమ్మత్తులు , విద్యుత్తు సరఫరా వంటి అంశాలపై కలెక్టరు సమీక్ష నిర్వహించారు. ఐ సి డి ఎస్ అధికారి వివరాలు తెలియ చేస్తూ, 704 పోషణ వాటికలు కోసం 687 చోట్ల స్థలాలు గుర్తించామన్నారు. ఆయా కేంద్రాలలో 218 చోట్ల పనులు పురోగతిలో ఉన్నట్లు తెలిపారు. 451 చోట్ల ప్రారంభించాల్సి ఉంటుందన్నారు .173 టాయిలెట్స్ నిర్మాణం చేపట్టాల్సి ఉందని, వీటిలో 17 చోట్ల పనులు ప్రారంభం కాలేదని వివరించారు. బాల పెయింట్స్, మరమ్మత్తులు 704 కేంద్రాలలో చేపట్టి నూరు శాతం ప్రగతి సాధించినట్లు తెలిపారు. విద్యుత్ సరఫరా కి 694 ప్రభుత్వ ఆధ్వర్యంలోని కేంద్రాలలో విద్యుత్ సరఫరా ఉన్నట్లు తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా 92,980 పరిశ్రమల యూనిట్స్ కి విద్యుత్ సరఫరా పై సర్వే చేపట్టాల్సి ఉందని జిల్లా కలెక్టర్ తెలియ చేశారు. ఇప్పటి వరకూ 23 మ్యానుఫాక్చర్యూనిట్స్, 147 సేవారంగంయూనిట్స్, 128 ట్రేడ్ యూనిట్స్ లలోసర్వే నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
ఈ సమావేశంలో కె ఆర్ సీసీ స్పెషల్ డిప్యూటి కలెక్టరు ఎస్. భాస్కర్ రెడ్డి , డ్వామా పిడి ఏ. నాగ మహేశ్వర రావు, జిల్లా పరిశ్రమ అధికారి శ్రీవనిధర్ రామన్, పిడి ఐ సి డి ఎస్ కే. విజయ కుమారి, తదితరులు పాల్గొన్నారు.