-రిటర్నింగ్ అధికారి సూర్యనారాయణ రాజు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా జిల్లాలో త్వరలో నాయకత్వ మార్పులు జరగనున్నాయని బిజెపి సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్ అధికారి సూర్యనారాయణ రాజు అన్నారు.ఎన్టీఆర్ జిల్లా బిజెపి సంఘటన పర్వ్ నేతలు, మండల అధ్యక్షులు, ముఖ్య నేతలతో భవానిపురం లోని ఎన్డీఏ కార్యాలయంలో సోమవారం సమావేశం
నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సూర్యనారాయణ రాజు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించి జిల్లాలో కీలక నియామకాలు జరుగుతాయన్నారు. బూత్ స్థాయి, మండల, జిల్లా స్థాయిలలో జరిగే అధ్యక్ష ఎన్నికల గురించి సమావేశంలో చర్చించారు.కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి బిజెపి కార్యకర్త ప్రజలకు వివరించాలన్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు నూతన కమిటీలు దోహదం చేస్తాయన్నారు. కార్యక్రమంలో బిజెపి నేతలు అడ్డూరి శ్రీరామ్, మాదల రమేష్, మువ్వల వెంకటసుబ్బయ్య, ఉప్పలపాటి శ్రీనివాసరాజు, షేక్ బాజీ, బి ఎస్ కే పట్నాయక్, గుడివాడ నరేంద్ర రాఘవ, కోలపల్లి గణేష్, బోగవల్లి శ్రీధర్, పైలా సురేష్, మహిళా మోర్చా అధ్యక్షురాలు బొమ్మదేవర రత్నకుమారి మండల నియోజకవర్గ బిజెపి నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.