Breaking News

అమ‌రావ‌తిలో కీల‌క ప‌నులకు టెండ‌ర్లు పిలిచేందుకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదం

-మొత్తం 11,467 కోట్ల మేర టెండ‌ర్ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన అథారిటీ
-సీఎం చంద్ర‌బాబు అథ్య‌క్ష‌త‌న జ‌రిగిన 41వ సీఆర్డీఏ అథారిటీ స‌మావేశం
-భ‌వ‌నాలు,రోడ్లు,మౌళిక వ‌స‌తులు చేప‌ట్టేందుకు అనుమ‌తులు
-ప్ర‌జ‌ల‌కు హామీ ఇచ్చిన విధంగా మూడేళ్ల‌లో అమ‌రావ‌తి పూర్తి
-అథారిటీ స‌మావేశంలో తీసుకున్న నిర్ణ‌యాల‌ను మీడియాకు వెల్ల‌డించిన మంత్రి నారాయ‌ణ‌

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
రాజ‌ధాని అమ‌రావ‌తిలో కీల‌క ప‌నులు చేప‌ట్టేందుకు సీఆర్డీఏ అధారిటీ స‌మావేశం ఆమోదం తెలిపింది…మొత్తం 11,467 కోట్ల మేర ప‌నుల‌కు అథారిటీ ఆమోదం తెలిపిన‌ట్లు మున్సిప‌ల్ శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ తెలిపారు..ఉండ‌వ‌ల్లిలోని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అధ్య‌క్ష‌త‌న సీఆర్డీఏ 41వ అథారిటీ స‌మావేశం జ‌రిగింది..ఈ స‌మావేశానికి మంత్రి నారాయ‌ణ‌,సీఎస్ నీర‌బ్ కుమార్ తో పాటు ఇత‌ర అధికారులు హాజ‌ర‌య్యారు…మొత్తం 23 అంశాల‌కు అధారిటీ ఆమోదం తెలిపింది…అధారిటీ తీసుకున్న నిర్ణ‌యాల‌ను మంత్రి నారాయ‌ణ మీడియాకు వెల్ల‌డించారు.
గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం మూడు ముక్కలాట తో అమరావతిని నిర్వీర్యం చేసిందన్నారు మంత్రి..కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమ‌రావ‌తి విష‌యంలో పలు కమిటీలు వేసి నివేదికల ఆధారంగా ముందుకెళ్తున్నామ‌న్నారు..సీఎం అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన సీఆర్డీఏ అథారిటీ స‌మావేశంలో 11,467 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచేందుకు నిర్ణ‌యించామ‌న్నారు…సీడ్ కేపిట‌ల్ లో నిర్మించే 360 కిమీల ట్రంక్ రోడ్లలో 2498 కోట్లతో కొన్ని రోడ్లకు పనులు ప్రారంభానికి ఆమోదం తెలిపింది..వరద నివారణ కు 1585 కోట్లతో పాల వాగు,కొండవీటి వాగు,గ్రావిటీ కెనాల్ తో పాటు రిజర్వాయర్లు నిర్మాణానికి నిర్ణ‌యించాం. గెజిటెడ్,నాన్ గెజిటెడ్,క్లాస్ -4,అల్ ఇండియా సర్వీస్ అధికారుల భవనాలు పనులను 3523 కోట్లతో చేపట్టేందుకు అధారిటీ ఆమోదం తెలిపింది..
రైతులకు ఇచ్చిన రిటర్ణబుల్ లే అవుట్ లలో రోడ్లు,మౌళిక వసతుల కల్పనకు 3859 కోట్లకు అనుమతి ఇచ్చిన‌ట్లు మంత్రి తెలిపారు..వీటితో పాటు హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ కు అధారిటీ ఆమోదం తెలిపింద‌న్నారు మంత్రి నారాయ‌ణ‌.ఆయా పనులకు వెంటనే టెండర్లు పిలిచి జనవరి నుంచి పనులు ప్రారంభిస్తామ‌న్నారు.

ఇక అమ‌రావ‌తి గ‌వ‌ర్న‌మెంట్ కాంప్లెక్స్ లోని 5 ఐకానిక్ టవర్లు,అసెంబ్లీ,హై కోర్టు భవనాలు డిజైన్లకు ఇప్ప‌టికే టెండర్లు పిలిచామ‌ని….ఈనెల 15 నాటికి డిజైన్ల టెండ‌ర్లు పూర్త‌వుతాయ‌న్నారు…డిసెంబ‌ర్ నెలాఖ‌రుకు ఆయా భ‌వ‌నాల నిర్మాణాల‌కు కూడా టెండ‌ర్లు పిలుస్తామ‌న్నారు..సీఎం చంద్ర‌బాబు పిలుపుతో కేవ‌లం 58 రోజుల్లో రైతులు 34 వేల ఎక‌రాల భూమిని స్వ‌చ్చందంగా ఇచ్చార‌ని…అలాంటి రైతుల‌ను గ‌త ప్ర‌భుత్వం అనేక ర‌కాలుగా ఇబ్బంది పెట్టింద‌న్నారు మంత్రి.ఆడవారిని కూడా హింసించారని…అస‌లురాజధాని అమరావతిలో ఉండకూడదని ప్రయత్నం చేశారని అన్నారు..5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు మాట ఇచ్చిన ప్రకారం రాబోయే మూడేళ్లలో అమరావతిని పూర్తి చేస్తామ‌న్నారు మంత్రి.

అథారిటీ ఆమోదించిన మొత్తం 23 అంశాలు…

1.సాంకేతిక క‌మిటీ ఇచ్చిన నివేదిక ప్ర‌కారం కాంట్రాక్ట్ ఏజెన్సీల‌తో ఒప్పందాలు ర‌ద్దు చేసుకున్న‌ప్ప‌టి నుంచి 120 రోజుల్లోగా పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు అథారిటీ ఆమోదం.సాంకేతిక క‌మిటీ కి ప్ర‌భుత్వం ఆమోదం తెలుపుతూ న‌వంబ‌ర్ 27న జీవో ఎంఎస్ 123 విడుద‌ల‌.

2.అమ‌రావ‌తి గ‌వ‌ర్న‌మెంట్ కాంప్లెక్స్ లో భాగంగా మ‌ధ్య‌లో నిలిచిపోయిన గెజిటెడ్ ఆఫీస‌ర్స్ టైప్ – 1,టైప్ – 2,క్లాస్ 4 ఉద్యోగుల అపార్ట్ మెంట్స్ పూర్తికి 594.54 కోట్ల‌కు అథారిటీ ఆమోదం.
మొత్తం 1440 అపార్ట్ మెంట్ ల పెండింగ్ ప‌నులు(ఆర్కిటెక్చ‌ర్,ప్లంబింగ్,శానిట‌రీ,ఫైర్,సెక్యూరిటీ వంటివి)పూర్తికి 594.54 కోట్ల తో పాల‌నాప‌ర‌మైన అనుమ‌తుల‌కు ఆమోదం.రెండేళ్ల (DLP(DEFECT LIABILITY PERIOD)తో ప‌నులు చేప‌ట్టేలా ఏజెన్సీకి ఇచ్చేందుకు నిర్ణ‌యం.నిర్మాణంలో ఉన్న సిల్ట్ ప్ల‌స్ 12 అంత‌స్తుల‌తో మొత్తం 14 ట‌వ‌ర్లు నిర్మాణం.2017 అక్టోబ‌ర్ 11న ఆయా క్వార్ట‌ర్ల నిర్మాణానికి అనుమ‌తి.మొత్తం 785 కోట్ల అంచ‌నాలు,408.63 కోట్ల ప‌నులు 2019 కంటే ముందే పూర్తి.

3.గెజిటెడ్ ఆఫీస‌ర్స్ టైప్ – 1,టైప్ – 2,క్లాస్ – 4 ఉద్యోగుల క్వార్ట‌ర్ల వ‌ద్ద మౌళిక వ‌స‌తుల క‌ల్ప‌నప‌నులను 226.26 కోట్ల‌తో చేప‌ట్టేందుకు అథారిటీ ఆమోదం.
తాగునీరు,అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజి,వ‌ర‌ద నీటి కాల్వ‌ప‌లు,వీధి దీపాలు,అంత‌ర్గ‌త ర‌హ‌దారులు,బిల్డింగ్ సెక్యూరిటీ,ల్యాండ్ స్కేపింగ్ ప‌నుల‌ను చేప‌ట్టేందుకు 2018 డిసెంబ‌ర్ 18న 121.34 కోట్ల‌కు అథారిటీ ఆమోదం తెలిపింది..మార్చి 2019 లో ప‌నులు ప్రారంభం అయ్యాయి..జూన్ 2019 లో నిలిచిపోయాయి..తిరిగి కాంట్రాక్ట్ ఏజెన్సీకి రెండేళ్ల (DLP(DEFECT LIABILITY PERIOD)తో ప‌నులు చేప‌ట్టేలా ఇచ్చేందుకు నిర్ణ‌యం.

4.నాన్ గెజిటెడ్ ఆఫీస‌ర్ల ఇళ్ల‌కు మిగిలిన ప‌నులను 607.50 కోట్ల‌తో చేప‌ట్ట‌డానికి అథారిటీ ఆమోదం.(ప్ర‌పంచ బ్యాంకు,ఏడీబీ నిధులు)
మొత్తం 1140 ఫ్లాట్లు 12 ట‌వ‌ర్ల‌లో సిల్ట్ ప్ల‌స్ 12 అంత‌స్తుల‌తో నిర్మాణం.

5,నాన్ గెజిటెడ్ ఆఫీస‌ర్ల ఇళ్ల‌కు మిగిలిన ప‌నులు,మౌళిక వ‌స‌తుల‌ను 594.36 కోట్ల‌తో చేప‌ట్టేందుకు అథారిటీ ఆమోదం.(ప్ర‌పంచ బ్యాంకు,ఏడీబీ నిధులు).
మొత్తం 9 ట‌వ‌ర్లు,సిల్ట్ ప్ల‌స్ 12 అంత‌స్థులు తో మొత్తం 855 ఫ్లాట్లు నిర్మాణం.

6.ఆలిండియా స‌ర్వీస్ అధికారులు(ముఖ్య కార్య‌ద‌ర్శులు,కార్య‌ద‌ర్శులు)కు 115 బంగ్లాల పెండింగ్ ప‌నులను 516.6 కోట్ల‌తో చేప‌ట్టేందుకు అథారిటీ ఆమోదం.
2017 డిసెంబ‌ర్ 27వ తేదీన ఆలిండియా స‌ర్వీస్ అధికారులైన ముఖ్య కార్య‌ద‌ర్శులు,కార్య‌ద‌ర్శుల కోసం జీ ప్ల‌స్ వ‌న్ విధానంలో నిర్మించేందుకు 274.5 కోట్ల‌కు పాల‌నాప‌ర‌మైన అనుమ‌తులు ఇచ్చారు..మే 2018 లో ప‌నులు ప్రారంభ‌మైన‌ప్ప‌టికీ జూన్ 2019 లో ప‌నులు నిలిచిపోయాయి..తిరిగి ఆ ప‌నుల‌ను పూర్తి చేసేందుకు 516.6 కోట్ల‌కు అథారిటీ ఆమోదం..మొత్తం 5,28,125 చ‌.అడుగుల విస్తీర్ణంతో ఈ 115 బంగ్లాలు నిర్మాణం.రెండేళ్ల (DLP(DEFECT LIABILITY PERIOD)తో ప‌నులు చేప‌ట్టేలా ఏజెన్సీకి ఇచ్చేందుకు నిర్ణ‌యం.

7 – 13 – ఎల్పీఎస్ జోన్ల లో మొత్తం 8496.30 ఎకరాల్లో మౌళిక వ‌స‌తులను 3859.66 కోట్ల‌తో చేప‌ట్టేందుకు అధారిటీ ఆమోదం.
రైతుల‌కు తిరిగిచ్చిన ల్యాండ్ పూలింగ్ స్కీం జోన్ల‌లో మౌళిక వ‌స‌తులు క‌ల్పించేందుకు అవ‌స‌ర‌మైన నిధులు విడుద‌ల‌కు ఆమోదం.రోడ్లు,వ‌ర‌ద నీరు కాల్వ‌లు,మంచినీటి స‌ర‌ఫ‌రా,డ్రైనేజి,ప‌వ‌ర్ డ‌క్ట్స్,రీయూజ్ వాట‌ర్ నెట్ వ‌ర్క్,వాకింగ్ ట్రాక్,సైకిల్ ట్రాక్ ల‌తో మౌళిక వ‌స‌తులు క‌ల్ప‌న‌.2019జూన్ కు ముందు 3306.59 కోట్ల‌తో ప‌నులు చేప‌ట్టాల‌ని నిర్న‌యం.స‌వ‌రించిన అంచ‌నాల ప్ర‌కారం 3859.66 కోట్ల‌కు ఆమోదం.

7. జోన్ – 1ఎ – నెక్క‌ల్లు – 1390.1 ఎక‌రాలు
8.జోన్ – 1బి – నెక్క‌ల్లు,శాఖ‌మూరు – 760.27 ఎక‌రాలు
9.జోన్ – 2బి – అనంత‌వ‌రం,నెక్క‌ల్లు,నేల‌పాడు,శాఖ‌మూరు,తుళ్లూరు గ్రామాల్లో కొన్ని భాగాలు – 1223.76 కిమీ
10.జోన్ – 2బి – అనంత‌వ‌రం,నెక్క‌ల్లు,నేల‌పాడు,శాఖ‌మూరు,తుళ్లూరు గ్రామాల్లో కొన్నిభాగాలు – 862.80 కిమీ
11.జోన్ – 5బి – అబ్బ‌రాజుపాలెం,బోరుపాలెం,దొండ‌పాడు,రాయ‌పూడి – 1788.42 కిమీ
12.జోన్ – 5డి – అబ్బ‌రాజు పాలెం,తుళ్లూరు,రాయ‌పూడి – 1488.81కిమీ
13.జోన్ – 6 – కొండ‌మ‌రాజుపాలెం,రాయ‌పూడి – 981.72 కిమీ.

14.అమ‌రావ‌తిలో హ్యాపీ నెస్ట్ ప్రాజెక్ట్ చేప‌ట్టేందుకు స‌వ‌రించిన అంచనాల‌కు(984.10 కోట్ల‌కు)ఆమోదం.కొత్త‌గా టెండ‌ర్లు పిలిచేందుకు అనుమ‌తి,ప్రాజెక్ట్ ఆల‌స్యంతో న‌ష్ట‌పోయిన 270.71 కోట్లు ప్ర‌భుత్వం చెల్లించేందుకు అనుమ‌తి.
మొత్తం 12 ట‌వ‌ర్లు జీ ప్ల‌స్ 18 అంత‌స్తుల్లో 1200 ఫ్లాట్లు.మొత్తంగా 20,89,260 చ‌ద‌ర‌పు అడుగుల్లో నిర్మాణం.
2018లో వంద శాతం సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ గా సీఆర్డీఏ చేప‌ట్టింది..190 ఫ్లాట్లు మిన‌హా మిగిలిన అన్ని ఫ్లాట్లు అమ్మ‌కం.
గ‌తంలో 2018-19 అంచ‌నాల ప్ర‌కారం 720.5 కోట్ల‌కు ఆమోదం తెలిపారు..2024-25 ధ‌ర‌ల ప్ర‌కారం 930 కోట్లు..దీనికి అద‌నంగా పెరిగిన లిఫ్ట్ చార్జీలు,లేబ‌ర్,డిజైన్ చార్జీలు,మెటీరియ‌ల్ ధ‌ర పెర‌గ‌డంతో ప్ర‌కారం 984.10 కోట్ల‌కు చేరింది.మొత్తం అపార్ట్ మెంట్ల నిర్మాణానికి ల్యాండ్ ధ‌ర 59.32 కోట్లు(ఎక‌రాకు 4.1 కోట్ల చొప్పున 14.46 ఎక‌రాలు),నిర్మాణ ధ‌ర 984.10 కోట్లు,ఇత‌ర ఛార్జీలు 37.76 కోట్లు క‌లిపి మొత్తం 1081.18 కోట్లు ఖ‌ర్చ‌వుతుంది..అయితే చ‌ద‌ర‌పు అడుగు 4049 రూపాయిల చొప్పున 1200 ఫ్లాట్ల‌కు 845.89 కోట్లు ఆదాయం వ‌స్తుంది.ప్రాజెక్ట్ ఆల‌స్యం కావ‌డంతో 235.29 కోట్లు,రెరా నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌డ్డీ చెల్లింపున‌కు 35.42 కోట్లు ఖ‌ర్చు క‌లిపితే మొత్తం 270.71 కోట్లు న‌ష్టం వ‌స్తుంది.

15.అమ‌రావ‌తి డెవ‌ల‌ప్ మెంట్ కార్పొరేష‌న్ గ‌తంలో ఇచ్చిన కాంట్రాక్ట్ లు ప్యాకేజి 1 నుంచి ప్యాకేజి 22 వ‌ర‌కూ,సీడ్ యాక్సిస్ రోడ్డుకు సంబంధించిన ప్యాకేజిలు ర‌ద్దుకు అధారిటీ ఆమోదం.
ట్రంక్ ఇన్ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ ప‌నులు,వ‌ర‌ద నివార‌ణ ప‌నులు,గ్రీన‌రీ ప‌నులుకు గ‌తంలో ఇచ్చిన కాంట్రాక్ట్ లు ర‌ద్దు.

16.ప్ర‌పంచ బ్యాంకు,ఆసియ‌న్ డెవ‌ల‌ప్ మెంట్ బ్యాంక్ నిధుల నుంచి అమ‌రావ‌తిలోని వ‌ర‌ద నివార‌ణ ప‌నులు
మూడు ప్యాకేజిలుగా చేప‌ట్టేందుకు అథారిటీ ఆమోదం.
అమ‌రావ‌తి డెవ‌ల‌ప్ మెండ్ కార్పొరేష‌న్ బోర్డు 45వ స‌మావేశంలో తీసుకున్న నిర్ణ‌యం ప్ర‌కారం వ‌ర‌ద నివార‌ణ ప‌న‌నులు మూడు ప్యాకేజిలుగా చేప‌ట్ట‌నున్నారు..ప్యాకేజి -1 ను 590.74 కోట్లు,ప్యాకేజి -2 ను 386.95 కోట్లు,ప్యాకేజి – 3ను 608.26 కోట్లు క‌లిపి మొత్తంగా 1585.95 కోట్లు ఖ‌ర్చు చేసేందుకు అథారిటీ ఆమోదం.

17.కేపిట‌ల్ సిటీలో ఎన్ – 9 రోడ్డు కు ప్యాకేజి 4 కింద మిగిలిపోయిన మౌళిక వ‌స‌తుల క‌ల్ప‌న కోసం 522.39 కోట్లకు పాల‌నాప‌ర‌మైన అనుమ‌తులు మంజూరుకు అథారిటీ ఆమోదం.
ఎన్ 9 రోడ్డు వెంబ‌డి రోడ్లు,తాగునీరు,వ‌ర‌ద నీటి కాల్వ‌లు,యుటిలిటీ డ‌క్ట్స్,పాద‌చారుల ట్రాక్ లు,సైకిల్ ట్రాక్ లు,ఎవెన్యూ ప్లాంటేష‌న్,స్ట్రీట్ ఫ‌ర్నీచ‌ర్ కోసం 522.39 కోట్ల‌ను వ‌ర‌ల్డ్ బ్యాంకు,ఆసియ‌న్ డెవ‌ల‌ప్ మెంట్ బ్యాంకు నిధుల నుంచి ఖ‌ర్చుపెట్టేందుకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదం.

18.కేపిట‌ల్ సిటీలో ఎన్ – 18 రోడ్డుకు ప్యాకేజి – 5 కింద మిగిలిపోయిన మౌళిక వ‌స‌తులు క‌ల్పించేందుఉ 98.17 కోట్ల‌కు ఆమోదం.
ఎన్ – 18 రోడ్డు వెంబ‌డి రోడ్లు,తాగునీరు,వ‌ర‌ద నీటి కాల్వ‌లు,యుటిలిటీ డ‌క్ట్స్,పాద‌చారుల ట్రాక్ లు,సైకిల్ ట్రాక్ లు,ఎవెన్యూ ప్లాంటేష‌న్,స్ట్రీట్ ఫ‌ర్నీచ‌ర్ కోసం 98.17 కోట్ల‌ను వ‌ర‌ల్డ్ బ్యాంకు,ఆసియ‌న్ డెవ‌ల‌ప్ మెంట్ బ్యాంకు నిధుల నుంచి ఖ‌ర్చుపెట్టేందుకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదం.

19.కేపిట‌ల్ సిటీలో ఎన్ – 15 రోడ్డుకు ప్యాకేజి – 6 కింద మిగిలిపోయిన మౌళిక వ‌స‌తులు క‌ల్పించేందుకు 482.01 కోట్ల‌కు ఆమోదం.
ఎన్ – 15 రోడ్డు వెంబ‌డి రోడ్లు,తాగునీరు,వ‌ర‌ద నీటి కాల్వ‌లు,యుటిలిటీ డ‌క్ట్స్,పాద‌చారుల ట్రాక్ లు,సైకిల్ ట్రాక్ లు,ఎవెన్యూ ప్లాంటేష‌న్,స్ట్రీట్ ఫ‌ర్నీచ‌ర్ కోసం 482.01 కోట్ల‌ను వ‌ర‌ల్డ్ బ్యాంకు,ఆసియ‌న్ డెవ‌ల‌ప్ మెంట్ బ్యాంకు నిధుల నుంచి ఖ‌ర్చుపెట్టేందుకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదం.

20.కేపిట‌ల్ సిటీలో E6 రోడ్డుకు ప్యాకేజి – 7 కింద మిగిలిపోయిన నిర్మాణ ప‌నులమౌళిక వ‌స‌తులు క‌ల్పించేందుకు 452.96 కోట్ల‌కు ఆమోదం.
E6 రోడ్డు వెంబ‌డి రోడ్లు,తాగునీరు,వ‌ర‌ద నీటి కాల్వ‌లు,యుటిలిటీ డ‌క్ట్స్,పాద‌చారుల ట్రాక్ లు,సైకిల్ ట్రాక్ లు,ఎవెన్యూ ప్లాంటేష‌న్,స్ట్రీట్ ఫ‌ర్నీచ‌ర్ కోసం 452.96 కోట్ల‌ను వ‌ర‌ల్డ్ బ్యాంకు,ఆసియ‌న్ డెవ‌ల‌ప్ మెంట్ బ్యాంకు నిధుల నుంచి ఖ‌ర్చుపెట్టేందుకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదం.

21.కేపిట‌ల్ సిటీలో E8 రోడ్డుకు ప్యాకేజి – 8 కింద మిగిలిపోయిన నిర్మాణ ప‌నులమౌళిక వ‌స‌తులు క‌ల్పించేందుకు 522.92 కోట్ల‌కు ఆమోదం.
E8 రోడ్డు వెంబ‌డి రోడ్లు,తాగునీరు,వ‌ర‌ద నీటి కాల్వ‌లు,యుటిలిటీ డ‌క్ట్స్,పాద‌చారుల ట్రాక్ లు,సైకిల్ ట్రాక్ లు,ఎవెన్యూ ప్లాంటేష‌న్,స్ట్రీట్ ఫ‌ర్నీచ‌ర్ కోసం 522.92 కోట్ల‌ను వ‌ర‌ల్డ్ బ్యాంకు,ఆసియ‌న్ డెవ‌ల‌ప్ మెంట్ బ్యాంకు నిధుల నుంచి ఖ‌ర్చుపెట్టేందుకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదం.

22.కేపిట‌ల్ సిటీలో N11 రోడ్డుకు ప్యాకేజి – 9 కింద మిగిలిపోయిన నిర్మాణ ప‌నులమౌళిక వ‌స‌తులు క‌ల్పించేందుకు 419.85 కోట్ల‌కు ఆమోదం.
N11 రోడ్డు వెంబ‌డి రోడ్లు,తాగునీరు,వ‌ర‌ద నీటి కాల్వ‌లు,యుటిలిటీ డ‌క్ట్స్,పాద‌చారుల ట్రాక్ లు,సైకిల్ ట్రాక్ లు,ఎవెన్యూ ప్లాంటేష‌న్,స్ట్రీట్ ఫ‌ర్నీచ‌ర్ కోసం 419.85 కోట్ల‌ను వ‌ర‌ల్డ్ బ్యాంకు,ఆసియ‌న్ డెవ‌ల‌ప్ మెంట్ బ్యాంకు నిధుల నుంచి ఖ‌ర్చుపెట్టేందుకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదం.

23.అమ‌రావ‌తిలో ట్రండ్ ఇన్ఫ్రాస్ట్ర‌క్చ‌ర్,వ‌ర‌ద నీటి యాజ‌మాన్యం,గ్రీన‌రీ వ‌ర్క్స్ కు సంబంధించి ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్ క‌న్స‌ల్టెంట్ నియామ‌కానికి అథారిటీ ఆమోదం.
ప్ర‌పంచ బ్యాంకు,ఏడీబీతో జ‌రిగిన చ‌ర్చ‌ల్లో తీసుకున్న నిర్ణ‌యం మేర‌కు క‌న్స‌ల్టెంట్ నియామ‌కానికి నిర్ణ‌యం.

Check Also

విద్యుత్‌ ఛార్జీల బాదుడుపై నిరంతర పోరాటం

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలపై కూటమి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *