విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గుడివాడ భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో సెయింట్ జోన్స్ ఒకేషనల్ జూనియర్ కాలేజి ఆవరణలో మానవ ప్రాణ శక్తి కేంద్రాలు మరియు యోగ శక్తి చికిత్సపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిధిగా విచ్చేసిన ఎస్పా భారత జాతీయ ప్రధాన కార్యదర్శి డా. మాకాల సత్యనారాయణ మాట్లాడుతూ మనిషి బ్రతకటానికి చావడానికి ముఖ్వ కారణం ప్రాణశక్తి అని దానిని పెంపొందించుకోవడానికి మనలోనే అనేక ప్రాణ శక్తి కేంద్రాలు వున్నాయని వాటిని క్రమం తప్పక వాడుకునే విధానాలను వివరించారు. రేపటి ప్రపంచం ఆరోగ్యంగా ఆనందంగా వుండాలంటే ఈ ప్రాణి కేంద్రాలుపై ప్రతి ఒక్కళ్ళు పట్టుసాధించాలని ప్రజలను కోరారు. కాలేజి యాజమాన్యం, భారత్ వికాస్ పరిషత్ గుడివాడ అధ్యక్షుడు దొరడ్ల శ్యాంబాబు, క్యాంప్ కో ఆర్డినేటర్ డా. రాధాకృష్ణ డా. మాకాల సత్యనారాయణను సన్మానించారు.
Tags vijayawada
Check Also
విద్యుత్ ఛార్జీల బాదుడుపై నిరంతర పోరాటం
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలపై కూటమి …