గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల నుండి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పిజిఆర్ఎస్)కు అందే ఫిర్యాదుల పరిష్కారం, అందించే ఎండార్స్మెంట్ లు విభాగాధిపతులు ప్రత్యేక శ్రద్ధతో పరిశీలించి ఇవ్వాలని నగరపాలక సంస్థ కమీషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ విభాగాదిపతులను ఆదేశించారు. శుక్రవారం కమిషనర్ చాంబర్లో పిజిఆర్ఎస్ ఆర్జీల పరిష్కారం, ఎండార్స్మెంట్ లపై ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ తొలుత ర్యాండమ్ గా పిజిఆర్ఎస్ కి ఇచ్చిన ఎండార్స్మెంట్ లను పరిశీలించి, ఫిర్యాదుదారు రీ ఓపెన్ చేసినా లేదా సంతృప్తి చెందని వాటికి విభాగాధిపతే నేరుగా క్షేత్ర స్థాయి పరిశీలన చేసి, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొన్ని ఎండార్స్మెంట్ ల్లో సమగ్రంగా వివరణ ఉండడంలేదని, విభాగాధిపతులు, క్షేత్ర స్థాయి అధికారులు, సచివాలయ కార్యదర్శులు సమన్వయంతో వ్యవహరిస్తే సమస్యల పరిష్కారం తేలికవుతుంన్నారు. పిజిఆర్ఎస్ లో `యట్ టు వ్యూ` 12 గంటలు మించితే సంబందిత విభాగ సూపరిండెంట్ కు షోకాజ్ నోటీసు జారీ చేయాలని జె.సెక్షన్ సూపరిండెంట్ ని ఆదేశించారు. ఈ-ఆఫీస్ ఫైల్ తప్పనిసరిగా విభాగ సూపరిండెంట్ ద్వారానే ఫార్వార్డ్ అవ్వాలన్నారు. అలాగే శనివారం స్కూల్స్ ల్లో జరిగే పేరెంట్స్ మీటింగ్ కి స్కూల్స్ వారీగా సీనియర్ అధికారులను ఇంచార్జ్ లుగా విధులు కేటాయించాలని డిప్యూటీ కమిషనర్ డి.శ్రీనివాసరావు ని ఆదేశించారు.
సమావేశంలో డిప్యూటీ కమిషనర్లు సిహెచ్.శ్రీనివాస్, టి.వెంకట కృష్ణయ్య, ఎస్.ఈ. నాగ మల్లేశ్వరరావు, సిటి ప్లానర్ రాంబాబు, సిఎంహెచ్ఓ డాక్టర్ శోభారాణి, ఎంహెచ్ఓ డాక్టర్ రవిబాబు, మేనేజర్ బాలజి బాష, విభాగాల సూపరిండెంట్లు అధికారులు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
విద్యుత్ ఛార్జీల బాదుడుపై నిరంతర పోరాటం
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలపై కూటమి …