Breaking News

మహిళల భద్రత ప్రభుత్వ లక్ష్యం..

– మహిళల భద్రత అంశంలో సమాజంలో సానుకూల దృక్పథం పెరగాలి.
– మహిళలను గౌరవించడం భారతీయ సంప్రదాయంలో ఒక‌ భాగం
– రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె. మన్మధరావు
– ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్టర్ డా. జి.ల‌క్ష్మీశ‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మ‌నదేశంలో మహిళలను దేవతలుగా ఆరాధించడం తరతరాలుగా వస్తున్న ఒక సత్సంప్రదాయమని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.మన్మధరావు అన్నారు. మహిళలపై హింస నిర్మూలన కోసం అంతర్జాతీయ దినోత్సవం మరియు మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా బందరు రోడ్డులోని ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం వద్ద శుక్రవారం మహిళల సమానత్వం 1కె వాక్ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలపై వివిధ రూపాల్లో జరుగుతున్న హింసను అరికట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. మహిళలపై జరుగుతున్న హింసను అరికట్టేందుకు రాజ్యాంగంలో పొందుపరచిన కఠినమైన చట్టాలను సరైన రీతిలో మహిళలు వినియోగించుకుని చట్టపరమైన హక్కులను పొందాలని కోరారు. ప్రధానంగా చిన్నారులపై జరుగుతున్న హింస విషయంలో సమాజంలో ప్రతి ఒక్కరు స్పందించాలన్నారు. సమాజంలోని ప్రతి మహిళను కాపాడుకోవడం సామాజిక బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు. భారతీయ శిక్షాస్మృతి స్థానంలో కేంద్ర ప్రభుత్వం నూతనంగా రూపొందించిన భారతీయ న్యాయ సంహిత లో మహిళలపై జరుగుతున్న హింసను నివారించేందుకు మరింత కఠినమైన చట్టాలు రూపొందించారన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ మహిళల రక్షణ విషయంలో జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా పనిచేస్తోందన్నారు. వివిధ శాఖలను సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించడం, పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయం స్థాయి వరకు ఆయా కళాశాల ప్రాంగణాల్లో మహిళల భద్రతకు, హింసను నివారించేందుకు చట్టపరంగా ఉన్న అవకాశాలను తెలియజేసేందుకు సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. పాఠశాలలు, కళాశాలల సమీపంలో కట్టుదిట్టమైన భద్రత నిరంతరం కొనసాగేలా పోలీసు శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉంటోందన్నారు. మహిళలు పనిచేస్తున్న ప్రాంతాలలో సైతం వారి హక్కులను కాపాడుకునేందుకు అవసరమైన చర్యలు వివరిస్తూ వారిలో చైతన్యం నింపేందుకు గ్రామీణ ప్రాంతాలలో జిల్లా యంత్రాంగం అవగాహన శిబిరాలు
క్రమం తప్పకుండా నిర్వహిస్తోందన్నారు. పురుషులతో సమానంగా ఎదుగుతున్న మహిళలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని తెలిపారు. ప్రపంచ దేశాలలో భారతీయ మహిళలకు ఉన్న ఔన్నత్యాన్ని, గౌరవాన్ని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో రక్షణ చర్యలు చేపడుతుందన్నారు. అన్ని రంగాలలోనూ మహిళలు ప్రాతినిధ్యం పెరిగేందుకు ప్రభుత్వం ఎన్నో ఉపాధి, ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తోం దన్నారు. మహిళలలో అక్షరాస్యత శాతం పెరిగితే మహిళలపై జరుగుతున్న హింసాత్మక ఘటనలకు అడ్డుకట్ట వేయవచ్చన్నారు. మహిళల భద్రత అనేది కేవలం నినాదంగా కాకుండా ప్రతి ఒక్కరూ ఆచరణలో చేసి చూపాలన్నారు.
కార్య‌క్ర‌మంలో సుంక‌ర రాజేంద్ర‌ప్ర‌సాద్‌, జి.నారాయ‌ణ‌రావు, జి.వాణి, కాట్ర‌గ‌డ్డ స్వ‌రూపారాణి, అట్లూరి కుమారి, ఉషారాజ‌, సుంక‌ర అనీష్‌, చెన్నుపాటి ఉషారాణి, కావూరి స‌త్య‌వ‌తి, అర‌స‌విల్లి సంధ్య త‌దిత‌రులు పాల్గొన్నారు.

Check Also

విద్యుత్‌ ఛార్జీల బాదుడుపై నిరంతర పోరాటం

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలపై కూటమి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *