Breaking News

NTR జిల్లా లో మొత్తం RSK లు -157 ఉన్నవి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మొత్తం పండిన పంట హెక్టార్లు – 35,416 హెక్టార్లు

వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం ధాన్యం దిగుమతి అంచనా సుమారు -2,36,803 MTs

ధాన్యము కొనుగోలు టార్గెట్ -1,00,000 MTs

జాయింట్ కలెక్టర్ గారు యొక్క ఆదేశాల మేరకు

తిరువూరు డివిజన్ లో RSKs @ PPC ధాన్యము కొనుగోలు కేంద్రాలు తేదీ- 01.11.2024 మరియు నందిగామ, విజయవాడ డివిజన్ నందు తేదీ- 05.11.2024 నా ప్రారంభమయ్యాయి.

గోనె సంచులను ఈ క్రింది విధముగా వివిధ డివిజన్ లో సమకూర్చబడ్డాయి
తిరువూరు డివిజన్ – 6,54,060
విజయవాడ డివిజన్ – 3,36,800
నందిగామ డివిజన్ – 2,63,000

గోనె సంచులతో పాటు RSK ల నందు అవసరం అయిన లేబర్ మరియు 303 GPS అమర్చబడిన రవాణా వాహనములు కూడా అందుబాటులో ఉంచబడినవి. గోనె సంచుల మరియు రవాణా వాహనములు అవసరం అయిన వారికి ముందస్తుగా కూడా ఇవ్వడం జరుగుతుంది.

RSKs నందు కావల్సిన సిబ్బందిని ఏర్పాటు చెయ్యడం జరిగినది.వారికి తగిన ట్రైనింగ్ ను పూర్తి చేశారు.అదేవిధముగా మరొక సారి అనగా రెండోవ సారి కూడా తిరువూరు, విజయవాడ డివిజన్ లో ఇవ్వడం అయినది.

ధాన్యముకు కనీస మద్దతు ధర ఒక క్వింటాకు
గ్రేడ్ A – Rs.2,320
కమాన్ – Rs.2300

PACS నిర్వహించు RSKs మొత్తము – 112 RSKs.
DCSM నిర్వహించు RSKs మొత్తము – 45 RSKs.

మొత్తము:157 RSKs

తిరువూరు డివిజన్ పరిధిలో ఉన్న RSKs ల సంఖ్య మొత్తము -58 RSKs

విజయవాడ డివిజన్ పరిధిలో ఉన్న RSKs ల సంఖ్య మొత్తము – 45 RSKs

నందిగామ డివిజన్ పరిధిలో ఉన్న RSKs ల సంఖ్య మొత్తము -54 RSKs

ఇప్పటి వరకు కొనుగోలు చేసిన మొత్తము – 27,415.920 మెట్రిక్ టన్నులు (గత పంట కాలములో అనగా ఖరీఫ్ 2023, తేదీ.5.12.2023 వరకు కొనుగోలు చేసినా ధాన్యము మొత్తం: 4,112.840 MTs)

ధాన్యము కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యము కొన్న రైతుల సంఖ్య – 3,907 రైతులు

ధాన్యము కొనుగులు చేసిన మొత్తము విలువ రూ. 61.10 కోట్లు

అందులో రైతులకు చెల్లించిన మొత్తము రు. 58.76 కోట్లు

చెల్లించుటకు సిద్ధముగా ఉన్న మొత్తము రు. 2.34 కోట్లు

తిరువూరు డివిజన్ లోనీ 51 RSKs నుండి ధాన్యము కొనుగోలు ప్రారంభం అయినది మరియు విజయవాడ డివిజన్ నందు 29 కొనుగోలు కేంద్రాలు మరియు నందిగామ డివిజన్ నందు 36 కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి.

ఒక పంట కాలములో ఒక రైతు నుండి గరిష్టముగా 25 ఎకరాల ధాన్యమును కొనుగోలు చెయ్యడం జరుగుతుంది

MTU 1262 మరియు MTU 1282 కూడా కోనుగులు చెయ్యడం జరుగుతోంది రైతులు దానిని గమనించి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవలెను

రైతులు దయచేసి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవలెను దళారులకు ధాన్యము అమ్మి నష్టపొరాదు. వాతావరణ ప్రతికూల సమయములో కూడా ధాన్యము కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్లి మీ ధాన్యమును కనీస మద్దతు ధర దక్కేలా అమ్ముకోగలరు

జిల్లా సివిల్ సప్లైస్ మేనేజర్ కార్యాలయము కంట్రోల్ రూమ్ నెంబర్-7702203571

Check Also

విద్యుత్‌ ఛార్జీల బాదుడుపై నిరంతర పోరాటం

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలపై కూటమి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *