-సమాజంలో అన్ని రంగాలలో వికలాంగుల హక్కులు మరియు శ్రేయస్సును ప్రోత్సహించే ఉద్దేశం దిశగా.. ఈ కార్యక్రమo: విభిన్న ప్రతిభావంతులు, వృద్ధులు, హిజ్రాల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు ఏ.వై. శ్రీనివాస్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
విభిన్న ప్రతిభావంతులు ప్రభుత్వ మంజూరు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ముందుకు వెళ్లాలని డి ఆర్ ఓ నరసింహులు పేర్కొన్నారు. శనివారం స్థానిక కలెక్టరేట్ లో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలు విభిన్న ప్రతిభావంతుల వృద్ధులు, హిజ్రాల, సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా డి ఆర్ ఓ మాట్లాడుతూ.. విభిన్న ప్రతిభావంతుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతిభావంతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. విభిన్న ప్రతిభావంతులు ఇతరుల మీద ఆధారపడకుండా వారి స్వయం కృషితో జీవించాలనేదే ప్రభుత్వ యెుక్క ఆశయమని ఇందుకోసం ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని, జిల్లా యంత్రాంగం తరఫున విభిన్న ప్రతిభావంతులకు అన్ని సదుపాయాలను అందించడం జరుగుతుందని అన్నారు. విభిన్న ప్రతిభావంతుల్లో కూడా ప్రతిభావంతులు ఉన్నారని అలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని అభివృద్ధి చెందాలని మీ అందరికీ అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ శుభాకాంక్షలు అని తెలిపారు.
విభిన్న ప్రతిభవంతులు శాఖ సహాయ సంచాలకులు మాట్లాడుతూ.. విభన్న ప్రతిభావంతుల సమిష్టి , స్థిరమైన భవిష్యత్తు కోసం మరియు వైకల్యం ఉన్న వారి నాయకత్వాలను విస్తరించడం వారికి జీవన ప్రమాణాలను మెరుగు పరచడంకోసం అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశమని అన్నారు. విభిన్న ప్రతిభావంతుల్లో మనకు ముందుగా కనిపించే వైకల్యం కళ్ళు, కాళ్లు, చేతులు లేకపోవడం వంటి వారే కాకుండా శారీరిక, మానసిక వైకల్యం కలిగిన వారు, దృష్టి వైకల్యం, వినికిడి లోపం మానసిక ఆరోగ్యం, తల సేమియా వంటి తదితర 21 రకాల విభిన్న ప్రతిభావంతులు గుర్తించడం జరిగిందని తెలిపారు. విభిన్న ప్రతిభావంతులు తమ ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల చదువులో మరియు కొన్నిసార్లు పనిలో కూడా సమాన అవకాశాలు వారి సామర్థ్యం మేరకు లేకపోవడంతో ఎంతో మంది బాధపడుతున్నారని ఇది వారి జీవనశైలితోపాటు శారీరిక శ్రేయస్సును కూడా ప్రభావతం చేస్తుందని అన్నారు. వారి సమస్యల గురించి ప్రపంచానికి తెలియజేయడానికి మరియు వారికి అనుకూల ప్రదేశంగా మార్చడానికి ఇటువంటి కార్యక్రమాలను జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. విభిన్న ప్రతిభావంతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లినప్పుడు వీరి సంక్షేమం కోసం కొత్త పథకాలను అమలు చేసి వారు ఆర్థిక భరోసాకు, వారి జీవన ప్రమాణాలను మెరుగు పరచడానికి ఈ కార్యక్రమాలు చేయూతనిస్తుందని తెలిపారు. ప్రభుత్వానికి తెలియచేయడం వలన వారి సంక్షేమం కోసం ప్రభుత్వము అనేక పథకాలను ప్రవేశపెట్టడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల అసోసియేషన్ లీడర్లు మాధవ, మురళి, సుబ్రమణ్యం, రెడ్డెప్ప, విజయ లక్ష్మీ, సుబ్రమణ్యం రెడ్డి, పద్మజ, విభిన్న ప్రతిభావంతుల విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.