Breaking News

జలంధర్ ఎన్ఐటి మరియు బీఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన ఆంధ్రప్రదేశ్ విలేకరులు

-జాతీయ విద్యా విధానం అమలు గురించి వివరించిన జలంధర్ ఎన్ఐటి
-వేవ్స్ కంటెంట్ సృష్టికర్తలకు అవకాశాన్ని నిరూపించింది: రాజిందర్ చౌదరి, ఏడిజి
-సరిహద్దు సవాళ్లను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు: జలంధర్, బీఎస్ఎఫ్ ప్రధాన కార్యలయం పంజాబ్ సరిహద్దు, ఐజి, అతుల్ ఫల్జెలే

జలంధర్, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ (ఆంధ్రప్రదేశ్) పత్రికా సమాచార కార్యాలయం అదనపు డైరెక్టర్ జనరల్ (ప్రాంతీయం) రాజిందర్ చౌదరి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ నుంచి విలేకరలు బృందం ‘‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’’ కార్యక్రమం కింద శుక్రవారం జలంధర్‌ని సందర్శించింది.
జలంధర్‌లోని జలంధర్ ఎన్ఐటి మరియు పంజాబ్ సరిహద్దు యొక్క బీఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయాన్ని విలేకరులు సందర్శించారు.
ఒక చర్చా సమావేశంలో, జలంధర్‌కి చెందిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటి) రిజిస్ట్రార్ ప్రొఫెసర్. అజయ్ బన్సల్ రీజనల్ ఇంజినీరింగ్ కాలేజీ నుంచి ఎన్ఐటికి ఎన్ఐటిజె యొక్క పురోగతిని మరియు దేశ ప్రగతికి విలువైన సహకారం గురించి వివరించారు. ప్రతి రాష్ట్రానికి దాని సొంత ప్రత్యేక రంగు ఉంటుందని, వివిధ రాష్ట్రాల సంస్కృతి మరియు అభివృద్ధిని సాధించడానికి ఇటువంటి మార్పిడి పర్యటనలు దోహదపడతాయని ఆయన అన్నారు.
ప్రెజెంటేషన్‌లో, డీన్ అకడమిక్ అఫైర్స్ ప్రొఫెసర్ రామన్ బేడీ, జలంధర్ ఎన్ఐటిలో నడుస్తున్న జాతీయ విద్యా విధానం, వివిధ విద్యా కార్యక్రమాలు మరియు ప్రాజెక్టులను అమలు చేయడంలో ఎన్ఐటిజే సహకారం గురించి వివరించారు.
యాదృచ్ఛికంగా, ఎన్ఐటిజే తమ సాంకేతిక విద్యార్థుల కోసం మేనేజ్‌మెంట్ డిగ్రీ ఎన్ఈపీ కింద ఐఐఎం విశాఖపట్నం, ఏపీతో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
ఈ సందర్భంగా సందర్శనకు విచ్చేసిన విలేకరులు మరియు పరిశోధనా ప్రతిభావంతులను ఉద్దేశించి, పీఐబి విజయవాడ ఏడీజీ రాజిందర్ చౌదరి ఎన్ఐటిజే విద్యార్థులు మరియు పరిశోధకులకు వేవ్స్- 2025 పై ప్రెజెంటేషన్ అందించారు.
ఏఐ ఆగమనం, అలాగే కోడింగ్ ఉద్యోగాలపై ప్రభావం చూపుతూ, యానియేషన్ గేమింగ్, కామిక్స్, ఫిల్మ్, జెనరేటివ్ ఏఐ, బ్రాడ్‌కాస్టింగ్ వంటి ఇతర రంగాలలో 27 పోటీలు ‘‘క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ సీజన్ 1’లో పాల్గొనాలని చౌదరి వారికి సలహా ఇచ్చారు. 2025, ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు జరిగే వేవ్స్‌కి న్యూఢిల్లీలోని భారత్ మండపం వేదిక కానుంది.
రోజువారీగా ఎదురయ్యే ఇంజినీరింగ్ సమస్యల ఫలితాల నాణ్యతను మెరుగుపరచగల సాంకేతికత మరియు ఏఐ ఆధారిత పరిష్కారాలతో బయటకు రావాలని శ్రీ రాజిందర్ చౌదరి విద్యార్థులకు సూచించారు. వ్యవసాయ రంగాన్ని స్మార్ట్ సాంకేతిక పరిష్కారాలతో ఆధునీకరించాలని ఆయన ప్రత్యేకంగా సూచించారు.
పంజాబీ సంస్కృతిని ప్రదర్శించడంలో భాగంగా ఎన్ఐటిజే విద్యార్థులు చేసిన భాంగ్రా నృత్యం ప్రేక్షకులను విశేషంగా అలరించింది.
సందర్శన విలేకరులకు జలంధర్‌లోని పంజాబ్ సరిహద్దు ప్రధాన కార్యాలయంలో బీఎస్ఎఫ్ కార్యకలాపాలపై కూడా ప్రదర్శన ఇవ్వడం జరిగింది. 553 కి.మీ అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతాల్లో బీఎస్ఎఫ్ యొక్క వివిధ కార్యకలాపాల గురించి ఐపిఎస్, ఐజి డాక్టర్. అతుల్ ఫల్జ్‌లే ప్రెజెంటేషన్ ఇచ్చారు. అనేక సవాళ్లు ఉన్నప్పటికీ చొరబాట్లు మరియు డ్రగ్ మాఫియా నుంచి సరిహద్దులను బీఎస్ఎఫ్ విజయవంతంగా కాపాడుతోందని ఆయన అన్నారు. ఈ ఏడాది కాలంలో 265.55 కేజీల మాదకద్రవ్యాలు, 35 రకాల మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకోగా, 160 మంది భారతీయులు, 29 మంది పాకిస్థానీలు, 91 మంది ఇతర భారతీయ స్మగ్లర్లను అరెస్టు చేశామని, ముగ్గురు పాకిస్థానీ చొరబాటుదారులను నిర్వీర్యం చేశామని ఆయన చెప్పారు.
మాదకద్రవ్యాల స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న 261 డ్రోన్‌లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.
సరిహద్దు గ్రామాలలో యువత పాల్గొనే వివిధ కార్యక్రమాలను కూడా అతుల్ వివరించారు. 2025, ఫిబ్రవరి 23న అమృత్‌సర్‌లో అట్టారీ బోర్డర్ మారథాన్ – 2025ను బీఎస్ఎఫ్ నిర్వహిస్తోందని, దీని కోసం రిజిస్ట్రేషన్లు సైతం మొదలయ్యాయని ఆయన చెప్పారు. విలేకరులతో జరిగిన సమావేశంలో బీఎస్ఎఫ్ సీనియర్ అధికారులు సైతం పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో జలంధర్ ఆకాశవాణి అసిస్టెంట్ డైరెక్టర్ (వార్తలు) రాజేష్ బాలి, అసిస్టెండ్ డైరెక్టర్ (సిబిసి, విజయవాడ)  ఆర్ రమేష్ చంద్ర మరియు జలంధర్ మీడియా అండ్ కమ్యూనికేషన్ సమాచార కార్యాలయం ఆఫీసర్ డాక్టర్ విక్రమ్ సింగ్ కూడా పాల్గొన్నారు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *