-9వ డివిజన్ పర్యటన లో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందజేయడం తోపాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ మోహన్ అన్నారు. ఆదివారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 9వ డివిజన్లో మసీద్ రోడ్డు కాలవ గట్టు చివరి ఏరియా లో 9వ డివిజన్లో ఎమ్మెల్యే గద్దె రామమోహన్ పర్యటించి స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ మోహన్ మాట్లాడుతూ డివిజన్లోని సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించడానికి నియోజకవర్గం లోని అన్ని డివిజన్లో పర్యటనలు చేస్తున్నానని చెప్పారు. డివిజన్ పర్యటనలో తెలుసుకున్న సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తానని అన్నారు. చిన్నపాటి సమస్యలను వెంటనే అధికారులు దృష్టికి తీసుకువెళ్లి రోజులు వ్యవధిలోనే పరిష్కారిస్తున్నామని చెప్పారు. ప్రధాన సమస్యలను నిధులు సమకూర్చుకొని సాధ్యమైనంత త్వరగా వాటిని కూడా పరిష్కరిస్తామని చెప్పారు. తమ ప్రభుత్వంఅధికారంలోకి వచ్చిన ఐదు నెలల వ్యవధిలోని ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు ప్రజాసమస్యలను పరిష్కరిస్తున్నానని చెప్పారు. మసీదు రోడ్డు కాలువ గట్టు రోడ్డు చివర వీధిలైటు ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. కాలువ గట్టు రోడ్డుపై రాకపోకలు సాగించడానికి ప్రమాదకరంగా ఉందని అందువల్ల రైయిలింగ్ కావాలని స్థానికులు అడిగారని వెంటనే రైయిలింగ్ ఏర్పాటుకు చర్యలుతీసుకుంటానని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్లను కూటమి ప్రభుత్వం మంజూరుజేస్తుందన్నారు. కొత్తగా రేషన్ కార్డులు పింఛన్లు కూడా అర్హులైన వారందరికీ అందజేస్తామని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ హామీ ఇచ్చారు. గత వైఎస్ఆర్సిపీ ప్రభుత్వం మాదిరిగా చిన్నపాటి కారణాలను చూపించి ప్రభుత్వ పథకాలను తొలగించమని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు. ఈ కార్యక్రమంలో చెన్నుపాటి గాంధీ, చెన్నుపాటి క్రాంతిశ్రీ, చిలకలపూడి లక్ష్మీనరసింహారావు, సూరపనేని సురేష్, వెంకటేశ్వరరావు తో పాటుగా స్థానిక పార్టీ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే గద్దె రామ మోహన్ వెంట ఉన్నారు.