Breaking News

సభ్యత్వ నమోదులో గిన్నిస్‌ రికార్డు సృష్టించనున్న తెలుగుదేశం

–టీడీపీలో ఎంపీ, ఎమ్మెల్యేగా ప్రజా సేవ చేసే అవకాశం రావడం చాలా గర్వంగా ఉంది.
–11వ డివిజన్‌లో టీడీపీ సభ్యత్వ కార్డులను అందచేసిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజాస్వామ్య యుతంగా సభ్యత్వ నమోదు నిర్వహించడమే కాకుండా కోటి మందికి సభ్యత్వాలు ఇచ్చి త్వరలో తెలుగుదేశం పార్టీ గిన్నిస్‌ రికార్డులో పేరు నమోదు చేసుకోబోతుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ చెప్పారు. ప్రజాస్వామ్య యుతంగా వ్యవహరించే తెలుగుదేశం పార్టీలో సభ్యుడిగా ఉంటూ ఎంపీగా, ఎమ్మెల్యేగా ప్రజా సేవ చేసే అవకాశం రావడం చాలా గర్వంగా ఉందన్నారు. ఆదివారం ఉదయం నియోజకవర్గంలో 11వ డివిజన్‌లో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ పరిశీలించారు. సభ్యత్వం తీసుకున్న వారికి ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ స్వయంగా సభ్యత్వ కార్డులను అందచేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామమోహన్‌ మాట్లాడుతూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నెల పది హేను రోజుల్లో కోటి మంది కి సభ్యత్వాలు పూర్తి చేసి గిన్నిస్‌ రికార్డులో పేరు నమోదు చేసుకోబోతున్నామని చెప్పారు. సభ్యత్వ నమోదు ప్రక్రీయ ముగియడానికి ఇంకా నెల రోజుల సమయం ఉందన్నారు. ఈ నెల రోజుల్లో సుమారు కోటి మందికి పైగా సభ్యత్వాలు తీసుకుంటారని చెప్పారు. కింది స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకుంటున్నామని అన్నారు. దేశంలో ఏ రాజకీయ పార్టీకి కూడా ప్రజాస్వామ్యయుతంగా కింది స్థాయి కార్యకర్తలు పార్టీ నాయకులను ఎన్నుకునే విధానం లేదని, ఒక్క తెలుగుదేశం పార్టీలోనే ఆ విధానం కొనసాగుతుందని చెప్పారు. ప్రజాస్వామ్య యుతంగా వ్యవహారిస్తున్న తెలుగుదేశం పార్టీలో తనకు సభ్యత్వం ఉన్నందుకు చాలా గర్వపడుతున్నామని అన్నారు. తూర్పు నియోజకవర్గంలో ఇప్పటికే సుమారు 30 వేలకు పైగా సభ్యత్వాలు పూర్తి అయ్యాయని, నియోజకవర్గంలో 20 మంది లక్ష రూపాయాలు చెల్లించి టీడీపీ జీవిత కాల సభ్యత్వ నమోదును తీసుకున్నారని చెప్పారు. తెలుగుదేశం పార్టీలో సభ్యుడిగా ఉంటూ ఎమ్మెల్యే, ఎంపీగా గెలిచి ప్రజా సేవ చేసే అవకాశం రావడం చాలా గర్వంగా ఉందని ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ అన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్‌ నాయకులు కోనేరు రాజేష్, పామర్తి కిషోర్, యలమంచిలి ప్రసాద్, జాస్తి సురేష్, కలగారా మాలతి, వల్లభనేని సృజన, కాటూరి సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *