Breaking News

మైలవరం నియోజకవర్గంలో 50 వేల టీడీపీ సభ్యత్వాలు పూర్తి

-ఉద్యమ స్పూర్తితో టీడీపీ సభ్యత్వ నమోదు
-టీడీపీ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపిన శాసనసభ్యులు కృష్ణప్రసాదు

మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి, మంత్రి వర్యులు నారా లోకేష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మైలవరం నియోజకవర్గంలో 50 వేల మైలురాయిని దాటింది. సభ్యత్వ నమోదు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. స్థానిక శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు పిలుపు మేరకు పార్టీ శ్రేణులు ఎంతో ఉత్సాహంగా సభ్యత్వ నమోదులో పాల్గొంటున్నారు.

ఈ సందర్భంగా శాసనసభ్యులు కృష్ణప్రసాదు మాట్లాడుతూ మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇంచార్జీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, యూనిట్ ఇన్చార్జులు, బూత్ కన్వీనర్లు అందరూ సమన్వయంతో పని చేస్తూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలన్నారు. విస్తృతంగా టీడీపీ సభ్యత్వాలను నమోదు చేయించాలన్నారు.

టీడీపీ సభ్యత్వం నమోదులో రూ.లక్ష కట్టిన వారికి శాశ్వత సభ్యత్వం ఇస్తున్నారు. రూ.100 చెల్లించి సభ్యత్వం తీసుకొన్న వారికి, గతంలో రూ.2 లక్షలుగా ఉన్న ప్రమాద బీమా సదుపాయాన్ని రూ.5 లక్షలకు పెంచారు. దీంతో పాటు కార్యకర్తల కుటుంబాలకు విద్య, వైద్యం, ఉపాధి కోసం పార్టీ సాయం అందిస్తున్నారు.

వాట్సాప్, టెలిగ్రామ్, ఆన్ లైన్ లో టీడీపీ మెంబర్ షిప్ పొందవచ్చు. అలాగే రెన్యువల్ చేసుకోవచ్చన్నారు. టీడీపీ సభ్యత్వాన్ని మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్ నుంచి… వాట్సాప్ ద్వారా అయితే https://bit.ly/4eK2Lj5 లింక్ ను, టెలిగ్రామ్ ద్వారా అయితే https://t.me/MyTDP_bot లింక్ ను లేదా https://telugudesam.org/membership-2024-26/ వెబ్ సైట్ లింక్ ద్వారా ఆన్ లైన్ లో నమోదు చేసుకోవచ్చు. పాత సభ్యత్వాన్ని రెన్యువల్ చేసుకోవచ్చు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *