-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయంలో కూడా నిర్వహించారు. సత్యనారాయణపురం లోని సర్కిల్ 2 కార్యాలయంలో కమిషనర్ ఫిర్యాదులను స్వీకరించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక లో వచ్చే ప్రతి సమస్యను స్వయంగా శాఖాధిపతులే ఫీల్డ్ లోకి వెళ్లి సమస్యను తెలుసుకొని సంతృప్తికరమైన పరిష్కారాన్ని అందించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. గతంలో స్వీకరించిన ఫిర్యాదులను శాఖాధిపతులు అనుసరించిన పద్ధతిని అడిగారు. ఇతర జోనల్ కార్యాలయాలు మరియు ప్రధాన కార్యాలయంలో జరిగే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిశీలించారు. స్వీకరించిన ప్రతి ఫిర్యాదును శాఖధిపతులు ఫీల్డ్ కి వెళ్లి అప్పుడున్న పరిస్థితిని వారు సమస్యను పరిష్కరించిన తర్వాత ఉన్న పరిస్థితిని ఫోటోలతో జతపరిచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను నిర్దేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో స్వీకరించి ప్రతి సమస్య పునరావుతం కాకుండా శాశ్వత పరిష్కారం అందించాలన్నారు.
సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో సర్కిల్ 2 కార్యాలయంలో ఆరు ఫిర్యాదులు అందగా, ప్రధాన కార్యాలయంలో 14 ఫిర్యాదులు అందగా అందులో అత్యధికంగా పట్టణ ప్రణాళిక విభాగంలో 9, ఇంజనీరింగ్ 2, రెవెన్యూ 3 ఫిర్యాదులు అధికారులు అందుకున్నారు.
సోమవారం సర్కిల్ 2 కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో జోనల్ కమిషనర్ 2 ప్రభుదాస్, డిప్యూటీ సిటీ ప్లానర్ చంద్రబోస్, అసిస్టెంట్ సిటీ ప్లానర్లు రాంబాబు, మోహన్ బాబు, ఇన్చార్జ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 2 ప్రభాకర్, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రామకోటేశ్వరరావు, అసిస్టెంట్ కమిషనర్ 2 శ్రీనివాస్ రావు, తదితరులు పాల్గొన్నారు.