రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రోడ్డు పనులను త్వరగా పూర్తిచేసి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర అన్నారు. సోమవారం ఉదయం తన పర్యటనలో భాగంగా 37, 54, 55 డివిజన్లో పర్యటించి కెనాల్ రోడ్, గాంధీ బొమ్మ సెంటర్, వించిపేట, నిజాం గేట్, ప్రాంతాలని పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కెనాల్ రోడ్లో పైప్లైన్ కోసం తవ్వేసిన రోడ్డును త్వరితగతిన పూర్తి చేసి భవాని దీక్షల కోసం వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలవకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. మెయిన్ బజార్ వద్ద జరిగే ఎల్.ఎన్. టీ నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేసి కాలేశ్వర రావు మార్కెట్ వరకు పూర్తి చేయాలని ఆదేశించారు. 55 వార్డులో జరిగే సిసి రోడ్ నిర్మాణ పనులను పరిశీలించారు, క్యూరింగ్ కోసం తీసుకునే చర్యలను పటిష్టంగా ఉండేటట్టు చూసుకొని, నాణ్యత ప్రమాణాలలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని అన్నారు. రోడ్డు వేసేటప్పుడు ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలకుండా ప్రత్యామ్నాయ మార్గం ఉండేటట్టు చర్యలు తీసుకుంటూ రోడ్లు వేయాలని ఆదేశించారు.

తదుపరి నైజం గేట్ వద్ద ఔట్ ఫాల్ డ్రైన్ లో జరిగే డీసిల్టింగ్ పనులను పరిశీలించారు, ఎస్కలేటర్ ను తక్షణమే మరమ్మత్తు చేసి వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని ఉన్నారు. గాంధీ బొమ్మ సెంటర్ వద్ద జరుగుతున్న డీజిల్టింగ్ పనులను పరిశీలించారు, నాలా మాన్ తీస్తున్న డ్రైన్ లను పరిశీలించి అవసరమైన చోట్ల గ్రీటింగ్ లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్, ఇంచార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *