-రెవెన్యూ సదస్సులను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి: డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ 6 నుండి జరుగుచున్న రెవెన్యు సదస్సుల కార్యక్రమంలో తిరుపతి జిల్లా నందు ప్రజల ముంగిటకు అధికార యంత్రాంగం వచ్చి వారి రెవెన్యూ సమస్యల పరిష్కారం కొరకు జిల్లావ్యాప్తంగా నేడు 32 గ్రామ సభలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో నేడు జరిగిన రెవెన్యూ సదస్సులో స్థానిక ప్రజా ప్రతినిధులు జిల్లా అధికారులు పాల్గొన్నారన్నారు. ఈ రోజు జరిగిన రెవెన్యూ సదస్సులలో వివిధ సమస్యలతో కూడిన దరఖాస్తులు తిరుపతి జిల్లాలో మొత్తం 696 అర్జీలు వచ్చాయని అందులో ల్యాండ్ గ్రాభింగ్ పై-16, ఫామ్ 22 ఏ పై -11, హౌస్ సైట్స్ పై- 53, ఆర్ ఓ ఆర్ పై- 283, అసైన్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్ పై -41, ఇతర విషయాల సంబంధించి – 223 అర్జీలు వచ్చాయని తెలిపారు. కొన్నిసమస్యలు అప్పటికప్పుడే పరిష్కరించబడ్డాయని, మిగిలిన అర్జీల సమస్యలను కాల పరిమితి లోపల సంబందిత అధికారులు పరిష్కరిస్తారని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు.