Breaking News

విద్యార్థులకు కళల పట్ల ఆసక్తి కలిగించాలి… భారతీయ సంస్కృతిని కాపాడుకోవాలి

-ఘనంగా రాష్ట్ర స్థాయి కళా ఉత్సవ్, బాలరంగ్ పోటీలు
-సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు IAS 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రాచీన కళలను ప్రోత్సహించాలని, కళలను సహ పాఠ్యాంశాలుగా చేసుకుని విద్యార్థులు భవిష్యత్తులో అభివృద్ధి చెందాలని సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS  అన్నారు. భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలను గుర్తు చేసి వాటి ప్రాముఖ్యతను తెలియజేసి, కళలను ప్రోత్సహించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర శిక్ష, రాష్ట్ర విద్య పరిశోధన శిక్షణ సంస్థ(SCERT) ఆధ్వర్యంలో విజయవాడ పట్టణ శివారు పోరంకిలోని మురళి రిసార్ట్స్ లో సోమవారం రాష్ట్ర స్థాయి ‘కళా ఉత్సవ్’ మరియు బాలరంగ్ రాష్ట్ర స్థాయి పోటీలు ప్రారంభమయ్యాయి.
ముఖ్య అతిథిగా హాజరైన సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు బి శ్రీనివాసరావు IAS జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు భారతీయ సంప్రదాయ కళలను నేర్చుకోవడం ద్వారా మనసుకు ప్రశాంతత, ఆహ్లాదకరం వాతావరణం అలవర్చుకోవచ్చని అన్నారు. కళలను ప్రోత్సహించడం, అభివృద్ధి చేసుకోవడం ద్వారా మన భారతీయ వారసత్వ సంపదను కాపాడుకోవచ్చన్నారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య శిక్షణా సంస్థ (ఎస్సీఈఆర్టీ) సంచాలకులు ఎంవి కృష్ణారెడ్డి  మాట్లాడుతూ ఈ పోటీల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి 6 నుండి 12వ తరగతి చదువుతున్న 200 మంది విద్యార్థులు, 50 మంది గైడ్ టీచర్లు ఎస్కార్టులుగా పాల్గొన్నారన్నారు. మంగళవారం సాయంత్రం ముగింపు కార్యక్రమంలో విజేతలకు బహుమతి ప్రదానం ఉంటుందన్నారు.
ఆరు పోటీలు ఇవీ:
రాష్ట్ర స్థాయి కళా ఉత్సవ్, బాలరంగ్ పోటీల్లో భాగంగా గాత్ర సంగీతం(Vocal Music), వాయిద్య సంగీతం(Instrumental Music), నృత్యం(Dance), థియేటర్(Theatre), దృశ్య కళలు (Visual arts), కథ చెప్పడం – బాలరంగ్ (Story Telling, And Balrang) 6 అంశాల్లో పోటీలు నిర్వహించామన్నారు.
ఈ కార్యక్రమంలో కృష్ణాజిల్లా విద్యాశాఖాధికారి పి.వి.జె. రామారావు, ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖాధికారి యు వి సుబ్బారావు, నోడల్ అధికారి డాక్టర్ శారద, శామో విభాగం ట్రైనింగ్ అండ్ ప్రోగ్రామ్ ఆఫీసర్ కల్పన శైల, ఉయ్యూరు డివిజన్ ఉప విద్యాశాఖ అధికారిణి పద్మా రాణి, పెనమలూరు మండల విద్యాశాఖ అధికారిణి కనకమహాలక్ష్మి, , ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *