-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా నగర పరిధిలోగల పిపిపి మోడల్ లో అభివృద్ధి చేయబోతున్న 17 ప్రాంతాలలో ఉన్న రోడ్ల ను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, సర్కిల్ 1 పరిధిలోని బి.ఆర్.పి రోడ్, నెహ్రూ రోడ్, కేటి రోడ్, కుమ్మరిపాలెం, సితార సెంటర్ నుండి సివిఆర్ ఫ్లైఓవర్, మొత్తం 7.37 కిలోమీటర్ల రోడ్లను, సర్కిల్ 2 పరిధిలోని బి.ఆర్టి..ఎస్ రోడ్, సాంబమూర్తి రోడ్, జిఎస్ రాజు రోడ్, 7.26 కిలోమీటర్ల రోడ్లను మరియు సర్కిల్ 3 పరిధి హెచ్టీ లైన్ రోడ్, గురునానక్ కాలనీ మెయిన్ రోడ్, పెనమనేని పాలీ క్లినిక్ రోడ్, టిక్కిల్ రోడ్, సిద్ధార్థ స్కూల్ రోడ్, జమ్మి చెట్టు సెంటర్ నుండి సిద్ధార్థ సర్కిల్ వరకు మదర్ తెరిసా సర్కిల్ నుండి అమ్మ కళ్యాణ మండపం వరకు పి.వి.పి.మాల్ రోడ్, రమేష్ హాస్పటల్ 8.37 రోడ్లను, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిపై 23 కిలోమీటర్ల రోడ్లను అభివృద్ధి చేయబోతున్నట్లు తెలిపారు. ఈ పర్యటనలో చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సామ్రాజ్యం, ఏపీ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ సభ్యులు, పాల్గొన్నారు.