విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పాములు కాలువ, వెస్ట్ బైపాస్ రోడ్డు, జక్కంపూడి రైతులు ప్లాట్ల యజమానుల వద్ద నుండి భూమిని సేకరించకుండానే ఎటువంటి నష్టపరిహారం చెల్లించకుండా అక్రమంగా కరెంట్ టవర్ లైన్ లను బలవంతంగా ఏర్పాటు చేస్తున్న కూటమి ప్రభుత్వం. బెస్ట్ బైపాస్ హైవే కి ఆనుకొని 40 ఎకరాల రైతుల భూమి 200 ప్లాట్లు వెరసి 400 కోట్ల రూపాయలకు పైచిలుకు విలువ గల భూమిని కూటమి ప్రభుత్వం రైతులకు సమాచారం ఇవ్వకుండా వారి దగ్గర నుండి భూమి సేకరించకుండా నష్టపరిహారం పైసా చెల్లించకుండా బలవంతంగా వారి భూముల్లో పోలీస్ శాఖను అడ్డం పెట్టుకొని అక్రమంగా హై టెన్షన్ లైన్లను ఏర్పాటు చేస్తున్నారు.
హై టెన్షన్ లైన్స్ ఏర్పాటు వలన మెగా ఇంజనీరింగ్ కంపెనీ కు మరియు లాంకో పవర్ సుమారు 50 కోట్ల రూపాయలకు పైగా లబ్ధి చేకూర్చేలా నిర్ణయం తీసుకుని రైతుల మరియు ప్లాట్ల యజమానుల జీవితాలను సర్వనాశనం చేస్తున్నారు. కేవలం పాములు కాలువ వద్ద మరియు జక్కంపూడి వద్ద వెస్ట్ బైపాస్ పై రెండు హై టెన్షన్ లైన్స్ ను మార్చడానికి నాలుగు టవర్ లైన్లు ఏర్పాటు చేస్తే సరిపోతుంది కానీ లాంకో పవర్ కు మెగా ఇంజనీరింగ్ కు లబ్ధి చేకూర్చడానికి 14 పైగా హై టెన్షన్ పోల్చును ఏర్పాటు చేస్తున్నారు.
రెండు హై టెన్షన్ లైన్స్ ను మార్చడానికి నాలుగు టవర్లు ఏర్పాటు చేయడానికి ఇద్దరు రైతులు 40 ఎకరాల భూములు గల రైతులను మరియు 200 ప్లాట్ల యజమానులను కాపాడేందుకు స్వచ్ఛందంగా భూమి ఇచ్చేందుకు అంగీకరించిన ఇద్దరు రైతులను పరిగణలోకి తీసుకోకుండా బలవంతంగా రైతులను పోలీస్స్టేషన్లో నిర్భందిస్తూ అక్రమంగా వారి భూములను కాజేసే కుట్ర కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఇంత అన్యాయం జరుగుతున్న స్థానిక ఎంపీ కేసినేని చిన్ని గాని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గానీ స్పందించడం లేదు. కలెక్టర్ రైతులతో కమిటీ వేసి చర్చిస్తామని హామీ ఇచ్చి రైతులకు న్యాయం చేయడం లేదు.
బలవంతంగా అక్రమంగా ఏర్పాటు చేస్తున్న హై టెన్షన్ కరెంట్ వైర్ టవర్ లైన్లో నిర్మాణాన్ని ఆఫ్ చేయాలని కొంతమంది రైతులు హైకోర్టు వారిని ఆశ్రయించి స్టే లు పొంది అన్నారు. హైకోర్టు స్టే ఉన్నప్పటికీ మెగా ఇంజనీరింగ్ కి చెందిన కాంట్రాక్టర్లు పోలీసు శాఖని అడ్డం పెట్టుకొని బలవంతంగా పనులు చేస్తున్నారు. రైతులకు ఫ్లాట్లు యజమానులకు ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు న్యాయం చేయాలి రైతులుకు అండగా నిలవాలి భూములను బలవంతంగా లాక్కొని లాంకో పవర్స్కు మరియు మెగా ఇంజనీరింగ్ కు లబ్ధి చేకూర్చే ప్రయత్నాలను విరమించుకోవాలి. నా శక్తి మేర రైతులుకి అండగా నిలబడతాం. వారికి న్యాయం జరిగేందుకు పోరాడుతామన్నారు పోతిన వెంకట మహేష్.