విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషనర్ల పనితీరును నిరసిస్తూ “ఫైట్ ఫర్ రైట్స్” సంస్థ ఆధ్వర్యంలో ధర్నా నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. స్థానిక గాంధీనగర్ ధర్నా చౌక్ సెంటర్లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఫైట్ ఫర్ రైట్స్ అధ్యక్షులు కె.పి రాజు మాట్లాడుతూ ఫిర్యాదులు అప్పీలు 90 రోజుల్లో విచారణకు స్వీకరించాలని సమాచారం ఇవ్వని అధికారులపై చట్ట ప్రకారం జరిమానా విధించాలని సమాచారం ఇవ్వని అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని కమిషన్ ఇచ్చు ప్రతి తీర్పు కాపీలను 30 రోజుల్లో దరఖాస్తుదారులు అందజేయాలని వెబ్సైట్ నందు పొందుపరచాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఆర్టిఐ కార్యకర్తలపై అక్రమంగా పెట్టిన తప్పుడు కేసులు పై పునర్వ్ చారణ జరపాలని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు అనుసరించి సమాచారం, కమిషన్ ఈ ఫైలింగ్ విధానం అమలు చేయాలని ,డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషనర్ల పని తీరుకు నిరసనగా వారి డిమాండ్లను విలేకరులు కుతెలియజేశారు. ఈ కార్యక్రమానికి “ఫైట్ ఫర్ రైట్స్”అధ్యక్షులు కె.పి .రాజు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ సంఘాల జే ఏ సీ సాకే హరి, యువజన రాష్ట్ర అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి రవి శంకర్ రెడ్డి ,హేమంత్ ,జి నవీన్ కుమార్, వివిధ జిల్లాల ఆర్టిఐ కార్యకర్తలు తదితరులు, పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
విద్యుత్ ఛార్జీల బాదుడుపై నిరంతర పోరాటం
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలపై కూటమి …