అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మినుములూరులో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటన ప్రత్యేకంగా నిలిచింది. పాడేరు మండలంలోని ఈ గ్రామంలో స్థానిక సచివాలయాన్ని సందర్శించిన మంత్రి, గ్రామస్తుల సమస్యలను స్వయంగా తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే, సభ కోసం తగిన ఏర్పాట్లు లేకపోవడంతో చెట్టు నీడలో కుర్చీలు ఏర్పాటు చేసి గిరిజనులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంలో గిరిజనులు తమ సమస్యలను మంత్రికి వివరించారు. తాగునీరు అందించాలని, రహదారులు మెరుగుపరచాలని, కాఫీ తోటల్లో కూలి పనులు తప్ప మరో ఉపాధి మార్గాలు లేకపోవడం, ఉపాధి హామీ పథకం క్రింద మరిన్ని పనులు కల్పించాలని, ప్రభుత్వ పథకాలు అందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా డి.ఆర్ డిపో ద్వారా రేషన్ తో పాటు నిత్యవసరకులు అందించారని కోరారు. అంతేకాకుండా, తమ గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని విన్నవించారు. ఈ అభ్యర్థనలపై మంత్రి సానుకూలంగా స్పందిస్తూ, గ్రామ అభివృద్ధి కోసం తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సమావేశం గిరిజన ప్రజలతో మంత్రి నేరుగా మమేకమయ్యే విధానానికి చక్కటి ఉదాహరణగా నిలిచింది.
Tags amaravathi
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …