-పట్టాలు లేనటువంటి ఇళ్లకు పట్టాలు
-పట్టాలు ఉన్నటువంటి ఇళ్లకు రిజిస్ట్రేషన్లు – విలేకరుల సమావేశంలో ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్న MLA బొండా ఉమా
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ సింగ్ నగర్ లోని సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరావు ఇళ్ల పట్టాలు, ఇల్లా రిజిస్ట్రేషన్ లపై విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ అనేక సంవత్సరాల నుండి విజయవాడ నగరంలో పేద వర్గాలు పొట్ట చేత పట్టుకొని, సొంత ఇంటి కోసం ఎదురుచూస్తున్నారని అనేక సంవత్సరాల నుండి సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో వివిధ డివిజన్లో 25&30 సంవత్సరాల నుండి నివాసం ఉంటున్నటువంటి ఇళ్లకు ఇళ్ల పట్టాలు , ఇళ్ల పట్టాలు ఉన్నటువంటి వారికి రిజిస్ట్రేషన్ ల కోసం ఎదురు చూస్తున్నారని నేను గతంలో అంటే 2014 నుండి 2019 లో శాసనసభ్యులుగా ఉన్నటువంటి సమయంలో నియోజకవర్గంలోని వివిధ డివిజన్లో నేను ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆనాడు ఉన్నటువంటి అధికారులతో సర్వే నిర్వహించగా ఇళ్ల పట్టాల కోసం, రిజిస్ట్రేషన్ ల కోసం సంవత్సరాలు తరబడి ఎదురుచూస్తున్నారని, అటువంటి ఇల్లు 7210 ఆనాడు సర్వేలో తేలిందని,దానిని యుద్ధ ప్రాతిపదిక మీద నేను పట్టాలు ఇచ్చి రిజిస్ట్రేషన్లు 5300 చేయించాను అని, తరువాత ఎన్నికలు రావడం నిలిచిపోవడం జరిగిందని… తదుపరి ప్రభుత్వమైన YCP జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నామమాత్రం గానే ఇళ్ల పట్టాలు అంటూ, రిజిస్ట్రేషన్లు అంటు మోసం చేసింది తప్ప శాశ్వత పరిష్కారం చూపలేదని విమర్శించారు.
ఇప్పుడు నేను తిరిగి శాసనసభ్యులుగా ఎన్నికైనటువంటి తర్వాత ఆనాడు నిలిచిపోయిన ఇళ్ల పట్టాలు, రిజిస్ట్రేషన్లు చేయించాలని ప్రధాన ధ్యేయంగా వాటికి సంబంధించినటువంటి ఫైల్స్ అన్ని రెడీ చేపించడం జరుగుతుంది, దానిలో భాగంగా 105 జీవో 2025 జనవరి 30 తేదీ వరకు ఉన్నందున పాయకాపురంలోని దేవినేని గాంధీ పురం, పాకిస్తాన్ కాలనీ, సుందరయ్య నగర్ లోని కొంత భాగం, న్యూ రాజరాజేశ్వరి పేట, అరుణోదయ నగర్, సుందరయ్య నగర్, నందమూరి నగర్, LBS నగర్ తదితర ప్రాంతాలకు లేనటువంటి ఇళ్లకు పట్టాలు, పట్టాలు ఉన్నటువంటి ఇళ్లకు రిజిస్ట్రేషన్లు నామ మాత్రపు ధరకు అంటే మొదటినుండి ఉన్నటువంటి ₹100 రూపాయలు చొప్పున, వాటిని కొనుగోలు చేసి ప్రస్తుతం ఉన్నటువంటి వారికి కూడా రిజిస్ట్రేషన్ చేసేటటువంటి కార్యాచరణను చేపట్టబోతున్నామని దీనిపై ఇప్పటికే కమిషనర్ గారితో మాట్లాడి స్పెషల్ టీం ను ఏర్పాటు చేయడం జరిగిందని, సర్కిల్ టు ACP రాంబాబు ను దీనికి అధికారిగా నియమించారు అని,సచివాలయ సిబ్బంది ద్వారా ఆయా ప్రాంతాలలో ప్రచారం చేపించి రిజిస్ట్రేషన్లు పట్టాలు కావలసినటువంటి ఇళ్లకు వెళ్లి ఆ యజమానులతో ఇది మంచి అవకాశం దీనిని సద్వినియోగం చేసుకోమని సచివాలయ ప్లానింగ్ డిపార్ట్మెంట్తో, అడ్మిన్లతో, సెక్రటరీలతో ప్రచారం చేపిస్తూ అవసరమైనటువంటి చోట మా పార్టీ నాయకులతో కూడా విస్తృత స్థాయిలో ప్రచారం చేపించి వీరందరికీ శాశ్వత పరిష్కారం చేయిస్తానని అన్నారు.
కొన్ని ప్రాంతాలలో ఇళ్లకు 22A జీవో ఉండటంతో కొన్ని ఇబ్బందులు ఎదురయినాయి అని వాటిని కూడా అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లి రిజిస్ట్రేషన్లు పట్టాలు కల్పించేటువంటి దిశగా కృషి చేస్తాను అని అన్నారు., ఈ శాశ్వత పరిష్కారం ద్వారా గాంధీ కోఆపరేటివ్ బ్యాంక్, దుర్గా కోఆపరేటివ్ బ్యాంకులలో ఇప్పుడు ఇచ్చేటువంటి విధంగా లోన్లే కాకుండా జాతీయ బ్యాంకుల ద్వారా కూడా అతి తక్కువ వడ్డీతో హౌసింగ్ లోన్లు ఇప్పిస్తామని దీనితో ఆ ఇళ్ల యజమానులు వారి పిల్లల విదేశీ చదువుకు కావలసి వచ్చిన, వివాహ సందర్భంలో, ఇతర రుణాలు ఉన్న , చదువు నిమిత్తం అన్నీ కూడా తక్కువ వడ్డీకి ఇచ్చేటువంటి విధంగా నారా చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో NDA కూటమి ఇచ్చినటువంటి మాట ప్రకారం చేస్తుంది అని, దానిని ముందుగా నేను రెవెన్యూ ఆఫీసర్ అయినటువంటి సుసోడియ తో నియోజకవర్గం లో ఉన్న ఇళ్ల గురించి వాటి పట్టాల గురించి, రిజిస్ట్రేషన్ ల గురించి పలు తపాలు మాట్లాడాను అని, ఇప్పటికే రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయని ఆ సదస్సుల్లో మా దృష్టికి వచ్చిన ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ లతో పాటు మేము గుర్తించిన పట్టాలకు రిజిస్ట్రేషన్లు కూడా త్వరత గతిన శాశ్వత పరిష్కారం చూపుతామని, దీనిని లోని నియోజకవర్గంలోని ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారు సద్వినియోగం చేసుకోవాలని తెలియపరిచారు.
ఈ సమావేశంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి, సెంటర్ నియోజకవర్గ కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు, నాగవంశ సాధికార కన్వీనర్ ఎరుబోతు రమణారావు,M మల్లేశ్వరరావు, బుగత శ్రీరాములు పాల్గొన్నారు.