-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
డిసెంబర్ 13, 2024 శుక్రవారం నాడు జరిగే స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ 2047 కార్యక్రమమును విజయవంతంగా నిర్వహించేందుకు విజయవాడ నగరపాలక సంస్థ వారి ఏర్పాట్లలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. గురువారం ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ కార్యక్రమం నిర్వహణ లో భాగంగా వివిధ శాఖల సమన్వయంతో జరుగుతున్న కార్యక్రమ ఏర్పాట్లలో కమిషనర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కార్యక్రమంలో పాల్గొనే వారందరి కోసం విజయవాడ నగరపాలక సంస్థ వారు ఏర్పాటు చేసే త్రాగునీటి సరఫరా లో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని, తాత్కాలిక మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉండేటట్టు అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలని, కార్యక్రమం ఏర్పాట్లలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలి అని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో చీఫ్ సిటీ ప్లానెట్ జి వి జి ఎస్ వి ప్రసాద్, ఇంచార్జి చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, సూపరిండెంటింగ్ ఇంజనీర్ (వర్క్స్) పి. సత్యనారాయణ, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రామ కోటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్, ఎస్టేట్ ఆఫీసర్ టి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.