Breaking News

స్వర్ణాంద్ర@2047 విజన్ కార్యక్రమమునుకు విస్త్రుత ఏర్పాట్లు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బందోబస్తు విధులు నిర్వహించు పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి బందోబస్త్ విధులపై పలు మార్గదర్శకాలు, సూచనలు మరియు సలహాలను అందించి, ఎన్.టి.ఆర్. జిల్లా నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. దిశానిర్ధేశం చేశారు.

విజయవాడ ఇందిరా గాంధి మున్సిపల్ స్టేడియం నందు ది 13.12.2024 వ తేదీన జరుగు స్వర్ణాంద్ర @2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కర‌ణ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా గౌర‌వ ముఖ్యమంత్రివ‌ర్యులు నారా చంద్రబాబు నాయుడు  పాల్గొంటున్న నేపధ్యంలో ఈ రోజు ది.12.12.2024 తేదిన నగర పోలీస్ కమీషనర్  ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.యస్ ఇతర పోలీసు అధికారులతో కలిసి పోలీస్ కమాండ్ కంట్రోల్ నందు బందోబస్త్ విధులు నిర్వహించడానికి వచ్చిన పోలీసు అధికారులులతో బందోబస్త్ నిర్వహణపై కూలంకుషంగా చర్చించడం జరిగింది.

అనంతరం ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం నందు పోలీస్ అధికారులు మరియు సిబ్బందితోపాటు అన్ని శాఖల అధికారులు మరియు సిబ్బందితో కలిపి సమావేశం ఏర్పాటు చేసి స్వర్ణాంద్ర @2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కర‌ణ కార్యక్రమం విజయవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా నగర పోలీస్ కమీషనర్ సిబ్బందితో మాట్లాడుతూ… ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు మరియు గౌరవ ఎమ్.పి లు మంత్రులు ఇతర వి.ఐ.పి.,లు ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొంటారు. కావునబందోబస్తులో పాల్గొనే అధికారులు మరియు సిబ్బంది వారికి కేటాయించిన విధులను అంకితభావంతో నిర్వహించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని, అన్ని శాఖల సమన్వయంతో బందోబస్త్ నిర్వహించాలని, అదేవిధంగా పోలీసు సిబ్బంది వారికి కేటాయించిన పాయింట్లు యందు అప్రమత్తంగా ఉండాలని వీక్షకలుకు, ఆహ్వానితులకు వారికి కేటాయించిన ప్రకారము వారు వెల్లవలసిన మార్గాలును నిర్దేశిస్తూ చెప్పవలెనని ఎక్కడైనా వాహనాలు బ్రేక్ డౌన్ అయినట్లయితే వెంటనే కంట్రోల్ రూమ్ కు గాని పై అధికారులుకు గాని వెంటనే తెలియ పర్చవలెను అని తెలియజేశారు.

స్టేడియం లోపలకు వచ్చేవారిని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆ తరువాత మాత్రమే సభా ప్రాంగణం లోనికి అనుమతించాలని, అదేవిధంగా ముఖ్య ప్రాంతాలలో మరియు ముఖ్య జంక్షన్ లలో ఎక్కడా ట్రాఫిక్ అంతరాయాలు కలుగకుండా ఉండేందుకు సిబ్బందిని అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ పర్యవేక్షించాలని, ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రజలు తమ వాహనాలు పార్కింగ్ ప్రదేశాల్లోనే పార్కింగ్ చేసేటట్లు చూడాలని వి.ఐ.పి, వి.వి.ఐ.పి రోడ్లలలో ట్రాఫిక్ జామ్ లేకుండా చూడాలని అందరూ అంకితభావంతో పనిచేసి ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఆకాంక్షిత బ్లాక్ కార్య‌క్ర‌మం (ఏబీపీ)పై అధికారుల‌తో క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

-పెనుగంచిప్రోలు ఇబ్రహీంపట్నం బ్లాక్ లను టాప్ టెన్ లో నిలపండి…. -హెల్త్ ,ఎడ్యుకేషన్, న్యూట్రిషన్ పై దృష్టి సారించండి….. -క‌లెక్ట‌ర్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *