గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పారిశుధ్య పనులు పిన్ పాయింట్ మేరకు జరగాలని, శానిటేషన్ కార్యదర్శులు, ఇన్స్పెక్టర్లు మరింత భాధ్యతగా ఇంటింటి చెత్త సేకరణ, డ్రైన్ల శుభ్రం పట్ల శ్రద్ధ చూపాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ప్రజారోగ్య అధికారులు, శానిటేషన్ కార్యదర్శుల ఆదేశించారు. సుద్దపల్లి డొంక, ప్రగతి నగర్, పొన్నూరు రోడ్, ఎల్ఆర్ కాలనీ, పట్నంబజార్ తదితర ప్రాంతాల్లో పర్యటించి, అభివృద్ధి, పారిశుధ్య పనులను పరిశీలించి, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఇంటింటి చెత్త సేకరణ నూరు శాతం జరగాలని, శానిటరీ డివిజన్ల వారీగా పిన్ పాయింట్ మేరకు పారిశుధ్య పనులు జరగాలన్నారు. డ్రైన్ల మీద ఆక్రమణలు లేకుండా ప్లానింగ్, శానిటేషన్ కార్యదర్శులు సమన్వయం చేసుకోవాలన్నారు. ఎల్ఆర్ కాలనిలో డ్రైన్లో మురుగు పారుదల లేకుండా ఉండడం, వ్యర్ధాలు నిలవడం గమనించి సంబందిత శానిటరీ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల నుండి పారిశుధ్య నిర్వహణ సరిగా లేదని పలు ఫిర్యాదులు అందుతున్నాయని, సచివాలయ పరిధిలో కార్యదర్శులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్నారు. నూతన సిసి రోడ్లు నిర్మాణ సమయంలోనే ఎండ్ టు ఎండ్ కు నిర్మాణం చేయాలన్నారు.
అనంతరం ఏటి అగ్రహారం, రామనామక్షేత్రం రోడ్ నిర్మాణ పనులను పరిశీలించి పనుల జాప్యం పై ఆగ్రహం ఇంజినీరింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు పూర్తి కాకపోవడం వలన దుమ్ముతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తక్షణం పనులు ప్రారంభించాలని కాంట్రాక్టర్లకు స్పష్టం చేశారు.
పర్యటనలో ఈ.ఈ. కోటేశ్వరరావు, డిసిపి సూరజ్ కుమార్, డిఈఈలు నాగ భూషణం, మధుసూదన్, శ్రీనివాస్, రెవెన్యూ అధికారులు సాదిక్ బాష, రెహ్మాన్, కార్పొరేటర్లు మీరావలి, ఆబీద్ బాష, ఏఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
పేదల, ప్రజల మనిషి ఎమ్మెల్యే గద్దె రామమోహన్
-సీఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ.17.50 లక్షల విలువైన చెక్కులను అందచేసిన నాగుల్‌మీరా, ఎమ్మెల్యే గద్దె రామమోహన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త …