గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరానికి ఉండవల్లి పంపింగ్ కేంద్రం నుండి త్రాగునీటిని సరఫరా చేసే 1600 ఎం.ఎం డయా మేజర్ పైప్ లైన్ పై తక్కెళ్లపాడు గ్రామంలో ఏర్పడిన లీకును జిఎంసి ఇంజినీరింగ్ అధికారులు షెడ్యుల్ కి ముందే బుధవారం అర్ధరాత్రికి పూర్తి చేశారని, గురువారం సాయంత్రం పాక్షికంగా, శుక్రవారం ఉదయం నుండి యధావిదిగా త్రాగునీటి సరఫరా జరుగుతుందని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏయస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తక్కెల్లపాడు గ్రామంలో ఏర్పడిన లీకుతో పాటు, వివిధ రిజర్వాయర్ల పరిధిలో కూడా గుర్తించిన లీకుల మరమత్తు పనులను జిఎంసి ఇంజినీరింగ్ అధికారులు నిర్దేశిత షెడ్యుల్ కంటే ముందుగానే పూర్తి చేసి ప్రజలకు నీటి సమస్య లేకుండా చేశారన్నారు. ఇప్పటికే ప్రధాన, అంతర్గత పైప్ లైన్ల పై లీకులను గుర్తించి ఎప్పటికప్పుడు మరమత్తు చేయాలని, త్రాగునీటి సరఫరాలో ప్రజలకు ఏ విధమైన అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకోవాలని వార్డ్ సచివాలయాల వారీగా కార్యదర్శులు, ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టం చేశామని తెలిపారు.
Tags guntur
Check Also
ఆకాంక్షిత బ్లాక్ కార్యక్రమం (ఏబీపీ)పై అధికారులతో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
-పెనుగంచిప్రోలు ఇబ్రహీంపట్నం బ్లాక్ లను టాప్ టెన్ లో నిలపండి…. -హెల్త్ ,ఎడ్యుకేషన్, న్యూట్రిషన్ పై దృష్టి సారించండి….. -కలెక్టర్ …