-జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం సైతం లెక్కచేయకుండా భూ, రెవెన్యు సమస్యల పరిష్కారం కోసం ఉత్సాహంగా పాల్గొన్న అర్జీదారులు:జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ శుభం బన్సల్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
చిన్న, సన్నకారు రైతుల భూ సమస్యల పరిష్కారానికి చక్కటి వేదికగా ప్రభుత్వం రెవిన్యూ సదస్సులు నిర్వహిస్తోందని, జిల్లా వ్యాప్తంగా జరుగుచున్న గ్రామ, మండల స్థాయిలో నిర్వహిస్తున్న రెవిన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ శుభం బన్సల్ పేర్కొన్నారు.ఈ సందర్బంగా ఇంచార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 6 నుండి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులకు సంబంధించి గురవారం తిరుపతి జిల్లాలో నిర్వహించిన గ్రామ రెవెన్యూ సదస్సులో రెవెన్యూ, భూ సమస్యలను సులభతరంగా పరిష్కరించుకోవడానికి అనువైన వేదిక రెవెన్యూ సదస్సులు అని ఈ అవకాశాన్ని సదరు గ్రామాలలోని బడుగు బలహీన వర్గాల ప్రజలు, నిరక్ష్యరాసులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
రెవెన్యూ సమస్యల పరిష్కారం కొరకు జిల్లావ్యాప్తంగా నేడు 51 గ్రామ సభలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. జిల్లాలో నేడు జరిగిన రెవెన్యూ సదస్సులో స్థానిక ప్రజా ప్రతినిధులు, మండల రెవెన్యూ, సంబందిత అధికారులు పాల్గొని. విజయవంతంగా రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చిన వివిధ సమస్యలతో కూడిన దరఖాస్తులు అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి చిన్న చిన్న సమస్యలు ఉన్న వాటిని అక్కడికక్కడే పరిష్కరించారన్నారు. తిరుపతి జిల్లాలో మొదటి రోజు నుండి నేటి వరకు జిల్లావ్యాప్తంగా 5127 అర్జీలు అందాయని అందులో నేడు 556 అర్జీలు వచ్చాయని అందులో ల్యాండ్ గ్రాభింగ్ పై -5, రీ సర్వే పై – 7, ఫామ్ 22 ఏ పై -2, హౌస్ సైట్స్ పై 152, ఆర్ ఓ ఆర్ పై -248, అసైన్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్స్ పై -48,క్యాస్ట్ వెరిఫికేషన్ – 4, ఆక్రమణకు గురి అయిన ప్రభుత్వ భూముల పై -12, దారి సమస్యలు -9, ఇతర విషయాల సంబంధించి – 61అర్జీలు వచ్చాయని తెలిపారు. ఈరోజు వచ్చిన అర్జీలలో 5 అర్జీల సమస్యలను అప్పటికప్పుడే పరిష్కరించడం జరిగిందని మిగిలిన అర్జీల సమస్యలను కాల పరిమితి లోపల సంబందిత అధికారులు పరిష్కరిస్తారని జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ తెలిపారు.