Breaking News

జిల్లా కల్లెక్టర్ల సదస్సులో సామాజిక భద్రత పెన్షన్లకు సంబంధించి వికలాంగుల నకిలీ సర్టిఫికెట్లను అరికట్టడానికి చర్యలపై సిఎం దృష్టికి తెచ్చిన జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
వెలగపూడి సచివాలయం లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన డిసెంబర్ 11,12 వ తేదీలలో రెండు రోజులపాటు నిర్వహించిన రెండవ రోజు జిల్లా కలెక్టర్ల సదస్సులో గురువారం తిరుపతి జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులు పెన్షన్ల కు సంబంధించి తిరుపతి జిల్లాలో కొందరు నకిలీ సర్టిఫికేట్లు పొంది పెన్షన్లు పొందుతున్నారని, కొన్నిటిలో దరఖాస్తులు వస్తున్నాయని, కొన్ని ఆసుపత్రులనుండి అర్హతలేనివారు సర్టిఫికేట్లు పొందుతున్నారని అలాంటి ఆసుపత్రులను గుర్తించి వారిపై చర్యలు తీసుకొనుటకు అవకాశం ఉంటుందని, దీనిపై మెడికల్ బోర్డు నందు మార్గదర్శకాలు సవరించగలిగితే చాలావరకు నకిలీ పెన్షన్లను తొలగించుటకు అవకాశం ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి గారు స్పందిస్తూ మెడికల్ బోర్డు నందు మార్గదర్శకాలను సక్రమంగా అమలు చేయాలని “ప్రభుత్వం ఒక్కటే పౌరుడు ఒక్కటే” అనే నినాదం తో ముందుకెల్లాలని ఏజేన్సీలకు చోటు లేకుండా ఎలాంటి అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సంబందిత అధికారులను ఆదేశించారు.

రెండవ రోజు సదస్సులో పరిశ్రమలు, ఐటీ, ఇండస్ట్రీస్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్, విద్యుత్, మానవవనరులు, ట్రాన్స్ పోర్ట్, రోడ్లు-భవనాలు, హౌసింగ్, హెల్త్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా సంక్షేమం, రెవిన్యూ, ఎక్సైజ్, మైన్స్, డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ప్లాన్స్ వంటి వివిధ అంశాలపై అధికారులకు సీఎం దిశా నిర్దేశం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *