అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీలో తాజాగా రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసిన తూర్పుగోదావరి జిల్లా టీడీపీ నేత సాన సతీష్ బాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ప్రస్తుతం ఏపీ నుంచి టీడీపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక కాపు ఎంపీగా సతీష్ బాబు నిలబోతున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో జనసేన ఎంట్రీతో టీడీపీ నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలకు ఎంపీగా పోటీ చేసే అవకాశం రాలేదు. దీంతో కాపు సామాజిక వర్గానికి చెందిన సానా సతీష్ బాబును చంద్రబాబు రాజ్యసభకు పంపాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు పోటీ కూడా లేకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సానా సతీష్ బాబుకు టీడీపీలో కీలక నేతగా పేరుంది. గతంలో పలు ఎన్నికల్లో టీడీపీకి తెర వెనుక ఉండి నడిపించిన నేపథ్యం ఆయనకు ఉంది. దీంతో సతీష్ బాబు సేవల్ని గుర్తించిన టీడీపీ అధిష్టానం ఆయన్ను రాజ్యసభకు పంపింది. అలాగే ఐటీ, విద్య మంత్రి నారా లోకేష్ కు కూడా అత్యంత సన్నిహితుడిగా పేరుంది. సానా సతీష్ బాబును ఎంపీగా పంపాలనే ప్రతిపాదన కూడా లోకేష్ నుంచే వచ్చిందనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో కాపు సామాజిక వర్గానికి చెందిన ఎంపీని టీడీపీ రాజ్యసభకు పంపింది. తద్వారా పార్లమెంటరీ పార్టీలో కాపు సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం లభించలేదన్న చర్చకు ఫుల్ స్టాప్ పెట్టేసింది.
Tags amaravathi
Check Also
అనధికార ట్యాప్, డ్రైనేజి కనెక్షన్లు కల్గి ఉండడం చట్టరీత్యా నేరం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అనధికార ట్యాప్, డ్రైనేజి కనెక్షన్లు కల్గి ఉండడం …