విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సెంట్రల్ నియోజకవర్గంలోని 59వ డివిజన్ సింగ్ నగర్ లూనా సెంటర్ నందు శుక్రవారం 3వ వార్షిక సెమీ క్రిస్మస్ వేడుకలు డివిజన్ సెక్రటరీ వేల్పుల రాజేష్ ఆధ్వర్యంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించుకోవడం జరిగినది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా :-ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరావు విచ్చేసి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి, క్రిస్మస్ భాకాంక్షలు తెలియజేయడం జరిగినది.
ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ క్రైస్తవ సోదరులు అత్యంత ఇష్టంగా ఎదురుచూసేటువంటి మాసం డిసెంబర్ నెల అని, ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ ఏసుప్రభు జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకుంటారని… సెంట్రల్ నియోజకవర్గంలో సెమీ క్రిస్మస్ వేడుకలు చేసుకోవడానికి తెలుగుదేశం ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయం చేస్తుందని, సేవే మార్గమని బైబిల్ చెప్పిన ఏసుప్రభు బైబిల్ ఆ మాటలను అనుసరిస్తూ నిజం చేసేటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని… నియోజకవర్గ శాసనసభ్యులుగా పేద వర్గాలకు మేలు చేసేటువంటి విధంగా తాను పని చేస్తానని, NDA కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటో తారీకే పెన్షన్ ఇంటింటికి వెళ్లి ఇస్తున్నామని, దివ్యాంగులకు వికలాంగులకు మేలు చేసే విధంగా మూడు వేల రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ ను 6000 చేసింది తెలుగుదేశం అని, ప్రతి మహిళకు ఇస్తానన్న మాట ప్రకారం ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నామని, ఐదు రూపాయలకే కడుపునిండా అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు ద్వారా ఎంతోమంది ఆకలి తీరుస్తున్నామని, మెగా డీఎస్సీ ద్వారా విద్యార్థులకు యువతకు ఉద్యోగాలు కల్పిస్తా ఉన్నామని,… రాబోయే ఎటువంటి రోజులలో మహిళలకు పిల్లలకు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేరుస్తామని, ఆ ఏసుప్రభు వారి ఆశీస్సులు చల్లని దీవెనలు ప్రజల మీద ఉండాలని కోరుకుంటూ క్రైస్తవ సోదరీ సోదరీమణులందరికీ సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, ఎలవర్తి శ్రీకాంత్,పైడి శ్రీను, బత్తుల కొండా, బెజ్జం జయపాల్, Sk బాషా, చల్లగాలి అనిల్, కొడాలి వంశీ, దాసరి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.