విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా ప్రజల పక్షాన పోరాడుతున్న వైసీపీ నాయకులను అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసం అని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ అధికార పార్టీపై నిప్పులు చెరిగారు..రైతుల ఆవేదన అధికారుల దృష్టికి తీసుకువెల్లె ప్రయత్నం చేశామని, దీనిని అడ్డుకుంటూ కూటమీ ప్రభుత్వం అడ్డుకోవడం కరెక్ట్ కాదన్నారు. కూటమి ప్రభుత్వం చేసే నిరంకుశ పాలనకు రానున్న కాలంలో ప్రజలే తగిన విధంగా బుద్ధి చెప్తారని హెచ్చరించారు.
రైతుల పక్షాన పోరాడతామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 13వ తేదిన ఇచ్చిన పిలుపు మేరకు కలక్టర్ కి వినతి పత్రం ఇవ్వటానికి వెళ్లిన, ఎన్టీఆర్ జిల్లా వైసిపి అధ్యక్షులు దేవినేని అవినాష్ నీ అరెస్ట్ చేసి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు తరలించిన సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలో జిల్లాలోని నియోజకవర్గ ఇన్చార్జులు, వైసిపి నాయకులు దేవినేని అవినాష్ ను కలసి మద్దతు తెలిపారు. అనంతరం దేవినేని అవినాష్ మీడియాతో మాట్లాడుతూ…రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కార్యక్రమానికి ప్రణాళిక చేశామని,ప్రభుత్వ కార్యక్రమం ఉందనే సాకుతో మమ్మలను అరెస్టు చేశారని మండిపడ్డారు. మహిళలను,కార్యకర్తలను అని కూడా చూడకుండా అరెస్టు చేశారనీ ఆగ్రహం వ్యక్తం చేశారు., తాము ఏమి తప్పు చేశామని కూటమి ప్రభుత్వం మమ్మల్ని అరెస్టు చేశారని నిలదీశారు. రైతులతో కలిసి వినతి పత్రం ఇద్దామని వెళ్తుంటే అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు.రైతుల ఆవేదన అధికారుల దృష్టికి తీసుకువెల్లె ప్రయత్నం చేశామని, నడిరోడ్డుపై మమ్మలని అరెస్టు చేశారని వాపోయారు..ఇచ్చిన హామీలు గురించి ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.దమ్ముంటే ఇచ్చిన హామీలు నెరవేర్చలని సవాల్ విసిరారు. రాబోయే రోజుల్లో రైతుల ఆగ్రహం కూటమి ప్రభుత్వం చూస్తుందన్నారు. ధాన్యం కొనుగోలు పూర్తిగా దళారి వ్యవస్థ మీద నడుస్తుందన్నారు..మా ప్రభుత్వంలో ఆ పరిస్థితి లేదన్నారు..రైతాంగానికి తాము అండగా నిలుస్తూమని, భయపడేది లేదు అరెస్టులకు వెనుకడుగు వేయమని స్పష్టం చేశారు..ఆరు నెలలు అవుతున్న ప్రభుత్వం వలన ఉపయోగం లేదన్నారు.
అనంతరం మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ…13వ తేదిన ఇచ్చిన పిలుపు మేరకు కలక్టర్ కి వినతి పత్రం ఇవ్వటానికి వెళ్తే అరెస్టు చేశారని,అనుమతి ఇచ్చి ఏ విధంగా అరెస్టు చేశారని ప్రశ్నించారు.పోలీస్ వ్యవస్థ నిర్లక్ష్యంగా వైసిపి శ్రేణులను అరెస్టు చేశారని, పోలీస్ వ్యవస్థ ప్రభుత్వానికి కొమ్ము కాస్తుందన్నారు.
అనంతరం మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు మాట్లాడుతూ…మహిళలను కూడా అవమాన పరిచారని అనుమతి ఇచ్చి అరెస్టు చేశారని మండిపడ్డారు.సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి నిరాశ పరిచారన్నారు. రెడ్ బుక్ ద్వారా అందరినీ బయపెడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అరుణ్, వైసిపి నేతలు షేక్ ఆసిఫ్, నర్నాల తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.