-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఆదేశాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శనివారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో అన్న క్యాంటీన్ నోడల్ ఆఫీసర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో 11 ప్రాంతంలో ఉన్న అన్న క్యాంటీన్లలో, త్రాగునీటి సరఫరా వాడుక నీరు, కిచెన్ లో పరిశుభ్రత, మరుగుదొడ్ల నిర్వహణ, భోజనంలో నాణ్యత, ప్రతిరోజు ఇస్తున్న టోకెన్ల వివరాలు నోడల్ ఆఫీసర్లు నిత్యం పర్యవేక్షిస్తూ ఎటువంటి మరమతులు ఉన్న వెంటనే చేయించి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులైన నారా చంద్రబాబునాయుడు గారు ప్రజల కోసం ఐదు రూపాయలకే భోజనం ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని అన్నారు.