-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శనివారం ఉదయం డిసెంబర్ 15, 2024న తుమ్మలపల్లి క్షత్రియ కళాక్షేత్రంలో జరిగే అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు ఆత్మార్పణం కార్యక్రమం ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కార్యక్రమం ఏర్పాట్ల లో ఎటువంటి లోపం ఉండకూడదని, విజయవాడ నగర పాలక సంస్థ వారు ఏర్పాటు చేయాల్సిన వసతుల్లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని వచ్చిన ప్రతి ఒక్కరికి త్రాగునీటి సరఫరా లో ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని, నిరంతరం పారిశుధ్య నిర్వహణ పక్కగా నిర్వహిస్తూ కార్యక్రమం జరిగే ముందు జరిగేటప్పుడు జరిగిన తర్వాత కూడా చర్యలు తీసుకోవాలని అందుకు అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ చూసుకోవాలని కమిషనర్ అన్నారు. ఈ పర్యటనలో చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్, చీఫ్ సిటీ ప్లానర్ జీవిజీఎస్వి ప్రసాద్, సూపరిండెంటింగ్ ఇంజనీర్లు సత్య కుమారి, సత్యనారాయణ, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రామ కోటేశ్వరరావు, అసిస్టెంట్ సిటీ ప్లానర్లు రాంబాబు , మోహన్ బాబు తదితరులు పాల్గొన్నారు.