-స్పోర్ట్స్ కాంప్లెక్స్ డెవలప్మెంట్ కోసం నిపుణులతో చర్చలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా విజయవాడలో క్రీడాభివృద్ధి చేసేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఎంపి కేశినేని శివనాథ్ నడుంబిగించారు. ఈ మేరకు శనివారం శాప్ అధ్యక్షుడు రవినాయుడు, శాప్ ఎమ్.డి గిరీషా ఐ.ఎ.ఎస్., పాపుల్యస్ (Populous) గ్లోబల్ ఆర్కిటెక్స్ ప్రతినిధి సిద్ధార్థ్, ఎన్.వి.ఆర్కిటెక్స్ ప్రతినిధి వెంకట్ లతో కలిసి పశ్చిమనియోజకవర్గం విద్యాధరపురంలోని లేబర్ కాలనీ గ్రౌండ్ పరిశీలించారు. ఈ గ్రౌండ్ ను స్పోర్ట్స్ కాంప్లెక్స్ అభివృద్ది చేసేందుకు వున్న అవకాశాలను పరిశీలించారు. అలాగే విజయవాడలో క్రీడాభివృద్దికి సంబంధించిన అంశాలపై కూడా చర్చించుకున్నారు.