Breaking News

కేసుల సత్వర పరిష్కారానికి రాజీ మార్గం రాజ మార్గం

-శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా రాజీ మార్గంలో అవార్డుల జారీ
-ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో  కోర్టుల పరిధిలో 57 బెంచ్ లు నిర్వహణ
-ఈ ఏడాది ఇప్పటి వరకు 7,352 కేసులలో రూ.100 కోట్ల 7 లక్షల మేర అవార్డ్ ల జారీ
-జిల్లా ప్రధాన జిల్లా జడ్జి గంధం సునీత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఇన్సూరెన్స్, సివిల్ తగాదాలు, మోటారు వాహన ప్రమాదాల, రాజీ పడతగ్గ క్రిమినల్ కేసుల పరిష్కారం లో రాజీ పడదగిన  కేసుల పరిష్కారానికి  చొరవ చూపేందుకు ముందస్తూగా సమావేశాలు నిర్వహించి, రాజీ మార్గం రాజ మార్గం గా అవగాహన కల్పించడం జరిగిందనీ, ఆమేరకు అవార్డి ఉత్తర్వులు జారీ నేపథ్యంలో సహకారం అందించిన ఇన్సూరెన్స్ కంపెనీలు, న్యాయవాదులు, ఇతర శాఖల అధికారులు, తదితరుల భాగస్వామ్య పార్టీలు అభినందనీయులని  జిల్లా ప్రధాన న్యాయమూర్తి జడ్జి  శ్రీమతి గంధం  సునీత అన్నారు. శనివారం స్థానిక కోర్టు ప్రాంగణంలో  జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, రాజమహేంద్రవరం వారి  ఆధ్వర్యంలో ఈ ఏడాది 4 వ జాతీయ  లోక్ అదాలత్ నిర్వహించి పలు కేసులు పరిష్కరించడం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి, డి ఎల్ ఎస్ ఎ అధ్యక్షురాలు జడ్జి గంధం సునీత  మాట్లాడుతూ, గౌరవ సుప్రీం కోర్టు వారి ఆదేశాలకు అనుగుణంగా వారి సూచనలు మేరకు రాజీ మార్గం ద్వారా కక్షి దారులకు సత్వర న్యాయం చేయాలనే లక్ష్యంతో పూర్వపు తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని నాలుగు రెవెన్యూ జిల్లాల పరిధిలో ఉన్న కోర్టుల యందు బెంచీలు ఏర్పాటు చేసి జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతోందని అన్నారు.

గౌరవ సుప్రీం కోర్టు వారి ఉత్తర్వులు, గౌరవ హై కోర్టు వారి ఆదేశాల మేరకు ప్రతి మూడు నెలలకు ఒకసారి జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతోందని ,ఆ క్రమంలో 2024 వ సంవత్సరం లో 4 వ జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతోందని అన్నారు.  మోటార్ ప్రమాదాల కారణంగా పరిహారం చెల్లింపులో ఆలస్యం నివారణ చేసే విధానం లో  లోక్ అదాలత్ నిర్వహించి కక్షి దారులకు సత్వర న్యాయం కోసం నిర్వహించడం, తద్వారా ఇరు పార్టీలకు డబ్బు వృథా కాకుండా చూడడం, సమయ వృధాను నివారించడం ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. తద్వారా ఇటువంటి లోక్ అదాలత్ లు ఇరు పక్షాలకు ఎంతో మేలు చేకూరుతుందని అన్నారు. ఆమేరకు ముందుగా ఇరు పార్టీలతో సమావేశం నిర్వహించి రాజీ చేయడం ద్వారా ఈరోజు ఆమేరకు అవార్డు జారీ చేశామన్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో సివిల్ కేసుల పరిష్కారం లో మొదటి స్థానంలో నిలవడం జరిగిందన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకూ నిర్వహించిన మూడు జాతీయ లోక్ అదాలత్ ద్వారా రూ.100 కోట్ల 7 లక్షల, 19 వేల మేరకు అవార్డ్ ఇచ్చినట్లు తెలియ చేశారు. ఈ బెంచ్ లలో వన్ టైం సెట్టిల్మెంట్ కు అవకాశం ఉంటుందన్నారు. సివిల్ 944 , క్రిమినల్ 5191, మోటార్ వెహికల్ కేసులు 655, పి ఎల్ సి 562 వెరసి 7352 పరిష్కారం చేసినట్లు తెలిపారు.

అన్ని రకాలైన రాజీ పడతగ్గ కేసులను జాతీయ లోక్ అదాలత్ లో రాజీ మార్గం ద్వారా పరిహారం చెల్లించాలని అవార్డ్ ఇవ్వడం జరిగిందన్నారు . కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు మోడల్ చెక్కు పంపిణీ చేస్తామని ముందుకు రావడం అభినందనీయం అన్నారు. జాతీయ లోక్ అదాలత్ ద్వారా తక్షణం రాజీ చెయ్యడం వల్ల ఉభయులకు సత్వర న్యాయం జరుగుతుందని, ఇందు వల్ల ఇన్సూరెన్స్ కంపెనీ లకు కూడా ఎంతో మేలు జరిగే అంశం అని గంధం సునీత పేర్కొన్నారు. ప్రజల్లో, కక్షి దారుల్లో లోక్ అదాలత్ లపై మరింతగా అవగాహన పెంచి సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవడం లో సామాజిక బాధ్యత అని స్పష్టం చేశారు. ఇరు పక్షాల మధ్య రాజీ మార్గం ద్వారా ఈరోజు నిర్వహించే జాతీయ  లోక్ అదాలత్ బెంచ్ కు వొచ్చిన కేసులకు పరిష్కారం చూపి ఆమేరకు అవార్డ్ ను ప్రకటించినట్లు పేర్కొన్నారు.

ఈరోజు నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో  క్రిమినల్ కేసులు – సివిల్ కేసులు -, ప్రీ లిటిగేషన్ కేసులు – ఉమ్మడి తూ.గో.  జిల్లాలో పరిష్కారమైన మొత్తం కేసులు లకి చెందిన  పరిహారం  అవార్డు జారీ చేసినట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన వారికి బజాజ్ అలియన్స్ ఇన్స్యూరెన్స్ కంపెనీ “తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయస్థానం మరియు మోటారు వాహన ప్రమాదాల దావా న్యాయస్థానము” నందు దేవరపల్లికి చెందిన వల్లభనేని సన్యాసి రావు కి రూ .కోటి 30 లక్షలు , రంగారెడ్డి జిల్లాకు చెందిన సిహెచ్ వాణి తదితరులకు రూ.90 లక్షలు చెక్కును అందచేశారు. జాతీయ లోక్ అదాలత్,   ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించడం ద్వారా కేసుల పరిష్కారం ద్వారా కక్షి దారులకు సత్వర  న్యాయం జరిగేలా న్యాయ మూర్తులు, కోర్టులు పనిచేస్తాయని డి ఎల్ ఎస్ ఎ కార్యదర్శి కే. ప్రకాష్ బాబు పేర్కొన్నారు.

ఈ జాతీయ లోక్ అదాలత్ లో ఒకటవ అదనపు జడ్జి ఆర్. శివకుమార్, డిఎల్ఎస్ఎ కార్యదర్శి కె ప్రకాష్ బాబు, రాజమండ్రి బార్ అసోసియేషన్ అధ్యక్షులు టి. వీరేంద్ర నాథ్, న్యాయ మూర్తులు , ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు, కక్షిదారులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *