రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి జిల్లా స్థాయి కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఘన నివాళి అర్పించడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కలెక్టరేట్ లో పొట్టి శ్రీరాములు 72 వ వర్ధంతి దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను అనుసరించి అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమాన్ని చేపట్టి ఘన నివాళి అర్పించడం జరిగిందని తెలిపారు.
తెలుగు భాష మాట్లాడే వారి కోసం ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆమరణ దీక్ష చేపట్టి, రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన గొప్పవ్యక్తి అన్నారు. తదుపరి రోజుల్లో నెల్లూరు జిల్లా కు ఆయన పేరు పెట్టడం జరిగిందనీ తెలిపారు. లక్ష్య సాధనలో ప్రాణాలు అర్పించిన అటువంటి నాయకుల నుంచి స్ఫూర్తి పొందాలని జాయింట్ కలెక్టర్ రాముడు పిలుపు ఇచ్చారు. భారతదేశంలో తొలిసారిగా భాషా ప్రయుక్త రాష్ట్రం కావాలని పోరాడిన యోధుడు పొట్టి శ్రీరాములు వర్ధంతి ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందనీ, ఆమేరకు మనందరం కలిసి అమరజీవి పొట్టి శ్రీరాములు కు నివాళులు అర్పించి నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిపివో ఎల్ అప్పలకొండ, ఇంఛార్జి జిల్లా బిసి సంక్షేమ అధికారి కె ఎన్ జ్యోతి, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ టి రాధిక, కలక్టరేట్ ఏవో ఆలీ, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.