విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగు వారి కోసం పోరాడిన మహాపురుషుడు ఆంధ్ర రాష్ట్ర సాధాన కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా వైయస్ అర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైయస్ అర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో బుధవారం విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద గల త్రిమూర్తి చౌక్ లోగల పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కొనకళ్ళ విధ్యాదరరావు, మద్దు బాలు, సెగు వెంకటేశ్వరరావు, కోట సుదర్శన్, రంగారావు, కొల్లిపర సురేష్ మరియు తదితర వైసిపి నాయకులు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి పొట్టి శ్రీరాములు ఈ రాష్ట్రం కోసం చేసిన పోరాటాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం వివిధ విభాగల నాయకులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
అనధికార ట్యాప్, డ్రైనేజి కనెక్షన్లు కల్గి ఉండడం చట్టరీత్యా నేరం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అనధికార ట్యాప్, డ్రైనేజి కనెక్షన్లు కల్గి ఉండడం …