విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
డిసెంబర్ 14, 15 తేదీలలో విజయవాడ, సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో డా.అంబేద్కర్ భవన్ లో రెండు రోజుల రాష్ర్ట సభలు రాష్ట్ర అధ్యక్షులు గరికిముక్కు సుబ్బయ్య అధ్యక్షతన జరిగాయి. ఈ సభల్లో కిషోర్ మక్వాన్, జాతీయ ఎస్సీ కమీషన్ చైర్మన్, డా.పరశురామ్, IAS(R) రాష్ర్ట గౌరవాధ్యక్షులు, కే.మన్మదరావు, SE (R), రాష్ర్ట అధ్యక్షులు, సామాజిక సామరస్యత వేదిక, విష్ణువు,SSF రాష్ర్ట అధ్యక్షులు, శ్యాం ప్రసాద్, జాతీయ కన్వీనర్, సామాజిక సామరస్యత, తదితరులు పాల్గొన్నారు. వివిధ జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో ప్రతినిధులు పాల్గొన్నారు.
జాతీయ ఎస్సీ కమ్మిషన్ చైర్మన్ కిషోర్ మక్వానా విలేకరులతో మాట్లాడుతూ జాతీయ ఎస్సీ కమీషన్ భారత రాజ్యాంగం అందించిన ఎస్సీల హక్కుల అమలు కోసం కృషి చేస్తోందన్నారు. షెడ్యూల్డు కులాలు ఎదుర్కొంటున్న వెలుగు చూడని వివక్ష పై నివేదికను పుస్తకం డా.పరశురామ్,IAS(R) జాతీయ చైర్మన్, ఎస్సీ కమీషన్, కిషోర్ మక్వానకు అందచేసారు.
ధార్మిక రంగం ద్వారా సామాజిక సమత కోసం సామరస్యత ఫౌండేషన్ (SSF) చేస్తున్న కార్యకలాపాలను విష్ణువు,
రాష్ర్ట అధ్యక్షులు SSF వివరించారు. సామాజిక స్థాయిలో సామాజిక సామరస్యతవేదిక ద్వారా జరుగుతున్న సమతా ప్రయత్నాలను నరసింగరావు నాయుడు, ఆంధ్ర ప్రదేశ్ కన్వీనర్, సామాజిక వివరించారు. వివిధ జిల్లాల్లో జరిగిన 26 నవంబర్ న భారత రాజ్యాంగ దినోత్సవం పై సమీక్ష జరిగింది. సభల్లో ఆచార్య బొంతు కోటయ్య,రాష్ర్ట ఉపాధ్యక్షులు, గొటుకుల జాషువా, రాష్ర్ట ప్రధాన కార్యదర్శి,దర్షనపు శ్రీనివాస్, రాష్ర్ట కార్యదర్శి పాల్గొన్నారు.