-తూర్పు కాపు విద్యా విజ్ఞాన భవన్ ప్రారంభోత్సవం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు కాపు విద్యా విజ్ఞాన అభివృద్ది సంఘం ఆధ్వర్యంలో సొంత నిధులతో ఒకరిపై ఆధారపడకుండా తూర్పు కాపు విద్యా విజ్ఞాన భవన్ నిర్మించుకోవటం ఎంతో ఆనందంగా వుందని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. సెంట్రల్ నియోజకవర్గం 27వ డివిజన్ లోని గులాబి తోట లో నిర్మించిన తూర్పు కాపు విద్యా విజ్ఞాన భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎంపి కేశినేని శివనాథ్ ముఖ్యఅతిథిగా హాజరు అయ్యారు. ఎంపి కేశినేని శివనాథ్ కి ఆ సంఘ నాయకులు ఘన స్వాగతం పలికారు. పూజకార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ఎంపి కేశినేని శివనాథ్ భవనం అంతా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ తూర్పు కాపు విద్యా విజ్ఞాన అభివృద్ది సంఘానికి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్న అందిస్తానన్నారు. త్వరలో నగరం రూపరేఖలు మారనున్నాయని, నగరాభివృద్దిలో పెద్దలందరి సహకారం కావాలని కోరారు. తూర్పు కాపు విద్యా విజ్ఞాన అభివృద్ది సంఘం నాయకులు ఎంపి కేశినేని శివనాథ్ ను గజమాలతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో తూర్పు కాపు విద్యా విజ్ఞాన అభివృద్ది సంఘం అధ్యక్షులు కోన శ్రీహరి సత్యనారాయణ, గౌరవ అధ్యక్షులు యలకల చలపతి రావు, ప్రధాన కార్యదర్శి చింతా సింహాచలం, కోశాధికారి పిన్నింటి రామారావు, కార్యనిర్వాహక కార్యదర్శి చీమల వెంకట రమణ, మాజీ అధ్యక్షులు కునుకు రాజశేఖర్ , ఉపాధ్యక్షులు కె.యస్.ఆర్.నాయుడు, ఇజ్ఞాడ తేజేష్, పిన్నింటి గణేష్, మీసాల రామకృష్ణ, కర్రోతి రామచంద్ర, కలిశెట్టి కనకారావు, కరణం వెంకటరమణ, ఇప్పిలి రామ్మోహనరావు, పిన్నింటి శ్రీనివాస్, కడగల చంద్రశేఖర్ లతో పాటు కార్యదర్శులు పాల్గొన్నారు.