విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు హనుమంతరాయ చేపల మార్కెట్ లోని డ్రెయిన్లు, తాగునీటి కుళాయిలను ఏర్పాటుచేసి మార్కెట్ ను అభివృద్ధి చేసే బాధ్యతను తీసుకుంటామని ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ తెలిపారు. జోనల్ కమిషనర్ రమ్య కీర్తన సంబంధిత అధికారులతో కలిసి సోమవారం 53 వ డివిజన్ లోని హనుమంతరాయ చేపల మార్కెట్, కొత్తపేట, గులాం మొహిద్దిన్ స్ట్రీట్, తదితర ప్రాంతాలలో పర్యటించారు. చేపల మార్కెట్ లో త్రాగునీరు డ్రైనేజీ సమస్యలు ఉన్నాయని ప్రవేశ ప్రాంతంలో గేట్లు ఏర్పాటు చేయాలని స్థానిక వ్యాపారస్తులు తెలియజేశారు. సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణమే సమస్యలను పరిష్కరిస్తామని ప్రత్తిపాటి శ్రీధర్ హామీ ఇచ్చారు. మార్కెట్ లో ఉన్న ఖాళీ దుకాణ సముదాయాల వివరాలను అందించాలని అధికారులను సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మార్కెట్ అభివృద్ధికి ఎమ్మెల్యే సుజనా చౌదరి కట్టుబడి ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ రమ్య కీర్తన, ఈఈ వెంకటేశ్వర రెడ్డి, అర్ఐ సత్యనారాయణ కూటమి నేతలు బొల్లేపల్లి కోటేశ్వరరావు, వేంపల్లి గౌరీ శంకర్, పోతిన అవినాష్, తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
అనధికార ట్యాప్, డ్రైనేజి కనెక్షన్లు కల్గి ఉండడం చట్టరీత్యా నేరం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అనధికార ట్యాప్, డ్రైనేజి కనెక్షన్లు కల్గి ఉండడం …