-రాష్ట్ర ఎం ఎస్ ఎం ఈ శాఖ మరియు సేర్ఫ్ శాఖామంత్రి కే శ్రీనివాస్
-కియా అనుబంధ రంగ పరిశ్రమల ద్వారా సుమారు లక్ష మందికి ఉపాధి పొందుతున్నారు
-రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందు చూపుతో ఉమ్మడి అనంతపురం జిల్లా పారిశ్రామిక రంగంలో ముందడుగు
-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మరియు చేనేత మరియు జౌళి శాఖ మంత్రివర్యులు సవితమ్మ
పెనుగొండ, నేటి పత్రిక ప్రజావార్త :
ఒకే జిల్లా-ఒక ఉత్పత్తి’ కార్యక్రమం కింద ఉత్పత్తుల శ్రేణిని విస్తరించాలని మరియు రాష్ట్రం యొక్క సమృద్ధిగా ఉన్న వ్యవసాయ మరియు అనుబంధ ముడిసరుకు వనరులను ఉపయోగించుకోవాలిరాష్ట్ర ఎం ఎస్ ఎం ఈ శాఖ మరియు సేర్ఫ్ శాఖామంత్రి కే శ్రీనివాస్ పేర్కొన్నారు, సోమవారం పెనుగొండ సబ్ కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎం ఎస్ ఎం ఈ, సేర్ప్ అంశాలపై సంబంధాలు అధికారులతో, పారిశ్రామికవేత్తలతో, భిన్న అభిప్రాయాలు, సూచనలు, సలహాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు సవితమ్మ, మడకశిర శాసనసభ్యులు ఎమ్మెస్ రాజు, పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూర రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పల్లె రఘునాథ్ రెడ్డి, ఏపీ ఐసీసీ పుట్టపర్తి జోన్ జిల్లా అధికారి సోనీ సహాని, అనంతపురం జిల్లా జిఎం శ్రీధర్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎంఎస్ ఎం ఈ మంత్రివర్యులు మాట్లాడుతూ ఉపాధి కల్పనలో రాష్ట్రంలోని సూక్ష్మ మధ్య చిన్న తరహా పరిశ్రమలు మంచి ఫలితాలు సాధిస్తున్నాయని తెలిపారు
పెట్టుబడి ట్రాకర్ మరియు సింగిల్ డెస్క్, PMEGP మరియు AP ఎగుమతుల పోర్టల్‌లతో సహా పరిశ్రమల కోసం వివిధ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా పరిశ్రమల స్థాపనకు పెద్ద ఎత్తున ప్రణాళిక అమలు చేయుచున్నామని వాటిని సద్వినియోగం చేసుకోవాలని మంత్రివర్యులు తెలిపారు.టెక్నాలజీని ఉపయోగించుకొని పనిచేయగలిగితే మన ఉత్పాదకత పెరుగుతుందని, సంపద సృష్టి జరుగుతుందని అన్నారు. వీటన్నింటినీ సాకారం చేసేందుకు విజన్ డాక్యుమెంట్‌తో పాటు 20 కొత్త పాలసీలు తీసుకొచ్చామని వివరించారు. జాబ్ ఫస్ట్ విధానంతో ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ పాలసీ, ఎంఎస్ఎంఈ పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ, ఎలక్ట్రానిక్ పాలసీ, సెమీ కండక్టర్ పాలసీ, ప్రైవేటు పార్కు పాలసీ, క్లీన్ ఎనర్జీ పాలసీ, డ్రోన్ పాలసీ, డేటా సెంటర్ పాలసీ, స్పోర్ట్స్ పాలసీ, టూరిజం పాలసీలను తీసుకొచ్చామని వివరించారు. అన్ని నియోజకవర్గాల్లో అధికార వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలనే ఉద్దేశంతో 175 నియోజకవర్గాల్లో 175 పారిశ్రామిక పార్కులు పెడుతున్నామని తెలిపారు. వీటివల్ల 5 లక్షల మందికి ఉపాధి వచ్చే పరిస్థితి ఉంటుందన్నారు. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ వల్ల రాష్ట్రం ఎనర్జీ హబ్‌గా తయారవుతుందని, ఇందులో 10 లక్షల కోట్లు పెట్టుబడులు రావాలని, 7 లక్షల 50 వేల మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా ప్రభుత్వం ముందు చూపుతో ఉన్నదని తెలిపారు. ఉమ్మడి జిల్లాలో అపారమైన చేనేత కార్మికుల ఉన్నారని, వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలపై అవగాహన కార్యక్రమాలు, పరిశ్రమల స్థాపనకు ముందు వచ్చే వారికి ప్రభుత్వం ప్రోత్సహకాలు, వివిధ రకాల బ్యాంకుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి, విరివిగా రుణాలు అందజేయడానికి కృషి చేయడానికి ఎస్ ఎల్ బి సి నందు పలు అంశాలనురాష్ట్రస్థాయిలో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు, ఎస్ హెచ్ జి మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి విస్తృతంగా కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నామని తెలిపారు, ఫుడ్ ప్రాసెసింగ్ విధానము, మొదలైన పరిశ్రమలు స్థాపనకు మహిళలు ముందుకు వస్తే వారిని ప్రోత్సహించి అభివృద్ధికి ప్రణాళికలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు
అనంతరం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు మాట్లాడుతూ చంద్రబాబు అంటేనే బ్రాండ్ జగన్ పాలన అంతా అప్పులమయమేనని, అయిదేళ్లలో వైసీపీ చేయని అభివృద్ధి మేం కేవలం 5 నెలల కాలంలోనే చేసి చూపించామని, చంద్రబాబు అంటేనే బ్రాండ్ అని, ఇందుకు రాష్ట్రానికి తరలొస్తున్న వేల కోట్ల రూపాయల పెట్టుబడులే నిదర్శమని మంత్రులు సవిత, 2019 వ సంవత్సరంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముందుచూపు ఆలోచనతో కియా పరిశ్రమలు తీసుకొచ్చి, ప్రపంచ పటంలో పెనుగొండ ప్రాంతాన్ని చూపెట్టడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం విజన్ 2047 ముఖ్యమంత్రి ప్రధాన లక్ష్యం అని పేర్కొన్నారు. అభివృద్ధి ద్వేయంగా మరి కొన్ని పరిశ్రమలు తెప్పించడానికి ముఖ్యమంత్రి కృత నిశ్చయముతో ఉన్నాడని పేర్కొన్నారు.ప్రతి ఇంటి నుంచి ఒక వ్యాపార వేత్తను తయారు చేయడమే లక్ష్యంగా ప్రణాళికలు అమలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో , పెనుగొండ ఆర్డిఓ ఆనంద్, డి ఆర్ డి ఏ పి డి నరసయ్య, ఎల్డిఎం రమణ కుమార్, డిక్కీ ప్రతినిధి వెంకటరమణ, వివిధ బ్యాంక్ అధికారులు, ఉమ్మడి జిల్లాల చాంబర్ ఆఫ్ కామర్స్ అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు, Serpఅధికారులు తదితరులు పాల్గొన్నారు.