– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం, విద్యా శాఖ వైఫల్యం వల్లే సమ్మెటివ్ అసెస్ మెంట్ (SA-1) లెక్కల ప్రశ్నపత్రం లీకైందని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. ఈనెల 11 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో 6 నుంచి పదవ తరగతి విద్యార్థులకు SA-1 పరీక్షలు ప్రారంభం కాగా.. నేడు జరగాల్సిన లెక్కల పరీక్ష వాయిదా పడిందన్నారు. కానీ పరీక్ష వాయిదాకి గల కారణాలు ప్రభుత్వం ఇప్పటివరకు తెలియజేయలేదని మండిపడ్డారు. పైగా పరీక్ష ప్రారంభమైన పది నిమిషాల తర్వాత విద్యార్థులకు ఇబ్బందులకు గురిచేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. అసలు పరీక్షలకు ముందుగానే ప్రతి క్వశ్చన్ పేపర్ కూడా ఆన్ లైన్ లో, యూట్యూబ్ లోకి ఎలా వస్తున్నాయని.. ఇది అధికారుల నిర్లక్ష్యం కాదా..? సమాధానం చెప్పాలన్నారు. రెగ్యులర్ ఎగ్జామ్స్ పరిస్థితే ఈవిధంగా ఉంటే.. కామన్ ఎగ్జామ్స్ ప్రశ్నాపత్రాలపై విద్యార్థులందరిలో భయాందోళన నెలకొందన్నారు. దీనిపై తల్లిదండ్రులకు, విద్యార్థులకు ప్రభుత్వం కచ్చితంగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.