Breaking News

నూత‌న రాజ్యస‌భ స‌భ్యుల‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన‌ ఎంపి కేశినేని శివ‌నాథ్

ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్య స‌భ‌కు నూత‌నంగా ఎన్నికైన సానా స‌తీష్ బాబు, బీద మ‌స్తాన్, ఆర్. కృష్ణ‌య్య ల ప్ర‌మాణా స్వీకారాన్ని పార్ల‌మెంట్ లో ఎంపి కేశినేని శివ‌నాథ్ త‌న స‌హ‌చ‌ర‌ ఎన్డీయే ఎంపిల‌తో క‌లిసి వీక్షించారు. రాజ్య స‌భ ఎంపీలుగా ప్ర‌మాణ స్వీకారం చేసిన‌ సానా స‌తీష్ బాబు, బీద మ‌స్తాన్, ఆర్. కృష్ణ‌య్య లకు కేంద్ర పౌర‌విమానాయ‌న శాఖ మంత్రి రామ్మోహ‌న్ నాయుడు తో పాటు ఎంపి కేశినేని శివ‌నాథ్ శుభాకాంక్ష‌లు తెలిపారు. అనంత‌రం ప్ర‌మాణ స్వీకారం చేసిన ముగ్గురు రాజ‌స‌భ్య స‌భ్యుల‌తో క‌లిసి రాజ్య‌స‌భ చైర్మ‌న్ కార్యాల‌యంలో చైర్మన్ జగదీప్ దన్‍ఖడ్, కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాల‌ను మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎంపిలు లావు శ్రీ కృష్ణ దేవ‌రాయులు, సీఎం ర‌మేష్, ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి, హ‌రీష్ మాథుర్, ద‌గ్గుమ‌ళ్ల ప్ర‌సాదరావు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, బ‌స్తిపాటి నాగ‌రాజు పాల్గొన్నారు.

Check Also

అనధికార ట్యాప్, డ్రైనేజి కనెక్షన్లు కల్గి ఉండడం చట్టరీత్యా నేరం

గుంటూరు,  నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అనధికార ట్యాప్, డ్రైనేజి కనెక్షన్లు కల్గి ఉండడం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *